BigTV English
Advertisement

INCOIS Jobs: డిగ్రీతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, వారం రోజులే గడువు

INCOIS Jobs: డిగ్రీతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, వారం రోజులే గడువు

INCOIS Jobs: హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, వెకెన్సీలు, విద్యార్హత, ముఖ్యమైన డేట్స్, వయస్సు, దరఖాస్తు విధానం, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


భారత ప్రభుత్వ భూశాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS).. కాంట్రాక్ట్ విధానంలో వివిధ ప్రాజెక్టుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76


ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

ప్రాజెక్ట్ సైంటిస్ట్-III: 04 పోస్టులు
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II: 16 పోస్టులు
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 09 పోస్టులు
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 17 పోస్టులు
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 15 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి కనీసం 60 శాతం మార్కులతో ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఇంజినీరింగ్, జియోఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితరన విభాగాల్లో మాస్టర్స్/ బ్యాచిలర్స్ లేదా తత్సమాన సంబంధిత డిగ్రీ, పీహెచ్‌డీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్-III ఉద్యోగానికి 45 ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్-II ఉద్యోగానికి 40ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I ఉద్యోగానికి 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగానికి 50ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం:  ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు రూ.78,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు  రూ.67,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు రూ.56,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.18,000 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:  సైంటిస్టు పోస్టులకు ఇంటర్వ్యూలు, అసిస్టెంట్లలకు రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష, ఇంటర్వ్యూ కేంద్రం: హైదరాబాద్

అభ్యర్థులు అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్ విడివిడిగా నిర్వహించనున్నారు.

ALSO READ: CHSL Jobs: ఇంటర్‌‌తో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×