BigTV English

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR:  కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR:  జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో… తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈవెంట్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ వేదిక ముందు కూర్చొని ఉండగా.. ఒకసారిగా ఓ అభిమాని వచ్చి ఆయన కాళ్లు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


Also Read : Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మొక్కిన అభిమాని


వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మొక్కారు వీరాభిమాని. ఈ ఈవెంట్ కు రాగానే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి… కాళ్ల పైన పడిపోయాడు అభిమాని. అనంతరం అతని దగ్గరికి తీసుకొని హగ్గు కూడా ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ఇద్దరు కూడా నల్ల రంగు బట్టలు వేసుకొని… ఈవెంట్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు.. కూడా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 1200 మంది… పోలీసు సిబ్బందితో ఈవెంట్ నిర్వహించారు.

క్షమాపణలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ ఓ సంచలన వీడియోను బయటకు వదిలారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే, బట్టి విక్రమార్క ను ఉద్దేశించి క్షమాపణలు కూడా చెప్పారు. తనను క్షమించాలంటూ ఎమోషనల్ వీడియోను కూడా.. జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నారు. గందరగోళంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని తాను మర్చిపోయానని… గుర్తు చేశారు జూనియర్ ఎన్టీఆర్.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఇతర అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. తమ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని పోలీసులను మెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 1200 మంది పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే ఈవెంట్ సక్సెస్ అయిందని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇలా ఉండగా.. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ( Juniro ntr ) విలన్ గా కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందు లో హీరోగా హృతిక్ రోషన్ ( Hritik roshan ) నటించగా… కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

 

Also Read: Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

 

 

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×