BigTV English

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

NTR:  జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్న సినిమా వార్ 2. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో… వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అది కూడా ముందు చెప్పినట్లుగానే హైదరాబాద్లో వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా… జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.


Also Read : Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

క్షమాపణలు కోరిన జూనియర్ ఎన్టీఆర్..


అంచనాలను పెంచిన వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అంటూ.. ఈవెంట్ అనంతరం ఒక వీడియోను బయటకు వదిలారు జూనియర్ ఎన్టీఆర్. నన్ను క్షమించాలి… అంటూ ఎమోషనల్ అయ్యారు. హడావిడిలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని మర్చిపోయాను అని పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అటు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ఫుల్ కావడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. వాళ్ల కారణంగా ఫ్యాన్స్ ను కలిసామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అస్సలు మర్చిపోబోమని… జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి మరి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్

బాలీవుడ్ స్టార్ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలా బోల్డ్ గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు ఇప్పటికే ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాదులో దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిత్ర బృందం నిర్వహించింది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న రోజే.. మరో పెద్ద సినిమా కూడా వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న కూలి సినిమా ఆగస్టు 14 తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొననుంది.

Also Read: Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Related News

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Upasana Konidela : రామ్ చరణ్ తో పెళ్లికి ముందే డేటింగ్.. సీక్రెట్ రీవిల్ చేసిన ఉపాసన…

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Coolie Movie : రిలీజ్ కు ముందే ‘కూలీ ‘ హిట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే..?

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Big Stories

×