BigTV English

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు మనల్ని ఒక ఉత్కంఠభరిత ప్రపంచంలోకి తీసుకెళతాయి. ఇవి కుంభకోణాలు, మోసాలు, సాధారణ వ్యక్తుల పోరాటాలు కలిసి మనల్ని ఆలోచింపజేస్తూ, సీట్ ఎడ్జ్‌లో ఉంచుతాయి. మీరు డార్క్ థ్రిల్లర్, ట్విస్ట్‌లతో నిండిన కథలను ఇష్టపడితే ఈ బెంగాలీ వెబ్ సిరీస్ మీ కోసమే. ఇది 2018లో బెంగాల్‌ను కుదిపేసిన “భాగర్” కుంభకోణం చుట్టూ తిరిగే ఒక డ్రామా-థ్రిల్లర్. ఈ సిరీస్ ఎక్కడ చూడొచ్చు? దీని పేరేమిటి ? అనే వివరాల్లోకి వెళదాం…


స్టోరీలోకి వెళితే

ఈ సినిమాలో రెండు కథాంశాలు ఉన్నాయి. ఒకటి అనిర్బన్, ఇన్స్పెక్టర్ లాహా న్యాయం కోసం చేసే పోరాటం. మరొకటి పరేష్ వ్యక్తిగత సంఘర్షణ. నోనాడంగాలో నివసించే పరేష్ ఒక సాధారణ వ్యక్తి. కానీ అతని జీవితం ఒక డార్క్ ట్రాజెడీ. అతను తన భార్య పుష్పా ను స్థానిక రౌడీ కానా బాపీతో “షేర్” చేయడానికి అనుమతిస్తాడు. “ఇది ఏమిటి, నా లైఫ్ ఇంత దారుణంగా మారిందా?” అని బాధపడతాడు. అతని ఆత్మగౌరవం దెబ్బతిని, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఒక వ్యక్తి మరణాన్ని తన కళ్ల ముందు చూసిన తర్వాత, “అమ్మో, చావడం అంత సులభం కాదు!” అని భయపడతాడు.


మరోవైపు అనిర్బన్ అనే ఒక ధైర్యవంతమైన యువకుడు, ఇన్స్పెక్టర్ లాహా అనే పోలీస్ ఆఫీసర్ కలసి, ఇక్బాల్ అనే దుర్మార్గుడి అరాచకాలను బయటపెట్టే మిషన్‌లో ఉంటారు. ఇక్బాల్ ఒక నకిలీ బేబీ ఫుడ్ బిజినెస్ నడుపుతూ, పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటుంటాడు. “ఈ బిజినెస్‌తో నేను సూపర్ రిచ్!” అని సరదాగా గొప్పలు చెప్పుకుంటాడు. అనిర్బన్, లాహా, “మీ గేమ్ ఇక ఆగిపోయింది, ఇక్బాల్!” అని ధైర్యంగా అతని కుంభకోణాన్ని బయటపెట్టడానికి ఆధారాలు సేకరిస్తారు. ఒక షాకింగ్ ట్విస్ట్‌లో, ఇక్బాల్, పరేష్ మధ్య ఒక మర్డర్ డీల్ జరుగుతుంది. ఇక్బాల్ పరేష్‌ను చంపడానికి రూ.50,000 ఇస్తాడు, కానీ ఈ ప్లాన్‌లో ఒక అమాయకుడు చనిపోతాడు. పరేష్ తప్పించుకుంటాడు.

Read Also : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

ఈకథలో మరిన్ని ట్విస్ట్‌లు వస్తాయి. పరేష్ మరో ట్రాప్‌లో చిక్కుకుంటాడు. కానీ అతని సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ అతన్ని రక్షిస్తుంది. అనిర్బన్, లాహా, బాబీ అనే యువతి సహాయంతో, ఇక్బాల్ నకిలీ బిజినెస్‌ను బయటపెట్టడానికి దగ్గరవుతారు. బాబీ వీళ్లకు కీలక సమాచారాన్ని అందిస్తుంది. క్లైమాక్స్‌లో ఊహించని మలుపులు వస్తాయి. ఇక్బాల్ కుంభకోణం బయటపడుతుందా ? పరేష్ తన భార్యను ఎందుకు షేర్ చేసాడు ? బాబీ ఎలాంటి సీక్రెట్స్ ను కనిపెడుతుంది ? ఈ స్టోరీకి శుభం కార్డు ఎలా పడుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ ను మిస్ కాకుండా చుడండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘Bhagar’. రాజ్దీప్ ఘోష్ దీనికి దర్శకత్వం వహించారు. 6 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ సగటున 20-24 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 2022 ఆగస్టు 31న KLiKK TV, OTTplayలో విడుదలైంది. ఇందులో రజతాభ దత్తా (ఇక్బాల్), పూజా సర్కార్ (పుష్పా), సబ్యసాచి చౌధురి (పరేష్), అమ్లాన్ మజుందర్ (ఇన్స్పెక్టర్ లాహా), ఐంద్రిలా శర్మ (బాబీ), బిప్లబ్ బంద్యోపాధ్యాయ, ప్రీతమ్ దాస్ (అనిర్బన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కి IMDB లో 6.8/10 రేటింగ్ ఉంది.

Related News

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×