Bangladesh Nagin dance : బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు 495 పరుగులు చేసి మంచి ఫామ్ కనబరిచింది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 485 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇక దీంతో గ్రౌండ్ లోనే శ్రీలంక అభిమానులు నాగిని డ్యాన్స్ చేశారు. పరుగులు చేయకపోయినా వికెట్లను కాపాడుకుంటూ టైమ్ పాస్ చేసి డ్రాగా ముగించుకున్నారు శ్రీలంక బ్యాటర్లు. శ్రీలంక అభిమానులు.. బంగ్లాదేశ్ అభిమాని పులివేశం ఉన్న గెటప్ లో జెండా పట్టుకొని నిలబడ్డాడు బంగ్లాదేశ్ అభిమాని. అయితే గ్రౌండ్ అతను నిలబడిన దగ్గరికీ వచ్చి ఓ శ్రీలంక అభిమాని నాగిని డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Rishabh Pant Century: ఇంగ్లాండ్ గడ్డపై రిషబ్ పంత్ వరుస సెంచరీలు.. సూపర్ మ్యాన్ రేంజ్ లో ఫీట్స్
శ్రీలంక ఆటగాడు భారీ స్కోర్..
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 163 పరుగులు చేసి ముష్పికర్ రహీమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ శాంటో కూడా క్చయ148 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు బంగ్లాదేశ్ ఓపెనర్ అన్ముల్ హక్ డకౌట్ గా వెనుదిరిగాడు. 10 బంతులు ఆడినప్పటికీ ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. శాద్మన్ ఇస్లాం 14 పరుగులు చేశాడు. .-మోమినల్ 29 పరుగులు చేసాడు. లిట్టన్ దాస్ కూడా 90 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నయీమ్ హాసన్ 11 పరుగులు మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 153.4 ఓవర్లలో 495 పరుగులు చేసింది. అలాగే ఛేజింగ్ కి దిగిన శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 485 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక 187 పరుగులు చేశాడు. దీంతో భారీ స్కోర్ చేసిన ఆటగాడిగా నిస్సాంక నిలిచాడు.
మ్యాచ్ డ్రా.. బంగ్లా కెప్టెన్ సెంచరీ వృధా..
శ్రీలంక ఆటగాడు నిస్సాంక ఈ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. కానీ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు శ్రీలంక ఓపెనర్. మరో ఓపెనర్ లహిర్ ఉదారా 29 పరుగులు చేశాడు. చందిమాల్ 54 పరుగులు చేశాడు. మాథ్యూస్ 39 పరుగులు, కమిందు మెండిస్ 87, రత్నాయకే 39, కెప్టెన్ ధనంజయ 19 పరుగులు మాత్రమే చేశాడు. మిగతా బ్యాటర్లు అంతా తక్కువ స్కోరు కే పరిమితమయ్యారు. తరిందు రత్నాయకే డకౌట్ అయ్యాడు. శ్రీలంక జట్టు 131.2 ఓవర్లలో తొలి ఇన్నింగ్స్ లో 485 పరుగులు చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ శాంటో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ ఇస్లాం 76 పరుగులు, ముష్పిర్ రహీమ్ 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రన్ ఔట్ కాకుంటే మరో సెంచరీ చేసేవాడని అభిమానులు పేర్కొనడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు మాత్రం 32 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ రావడం విశేషం.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 23, 2025