Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: విహారయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. బంధు, మిత్రుల వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, రెస్టారెంట్స్ వ్యాపారాలలో లాభాలు గడిస్తారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య2
కలిసి వచ్చేరంగు: తెలుపు రంగు
విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి.
వృషభరాశి: సోదరులతో కలిసి భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. ధనలాభం కలుగుతుంది. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పితృ సంబంధిత ఆస్తులు చేతికందుతాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 5
కలిసి వచ్చేరంగు: ఆకుపచ్చ రంగు
అశ్వథ్థవృక్షానికి ప్రదక్షిణలు చేయండి.
మిథునరాశి: తొందరపాటు నిర్ణయాలతో నష్టపోతారు. పౌరషమే ప్రధానమనే మూర్ఖపు పోకడతో దగ్గరి వారిని దూరం చేసుకుంటారు. అక్క, చెల్లెళ్ళ సలహాలు పాటించండి మంచి జరుగుతుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 7
కలిసి వచ్చేరంగు: ఎరుపురంగు
సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుకోండి.
కర్కాటకరాశి: సదాచార ప్రవర్తన కలిగి ఉంటారు. మీకై మీరు ఏర్పాటు చేసుకున్న నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తారు. మీ చుట్టూ ఉన్నవారంతా క్రమశిక్షణతో ఉండాలని భావిస్తారు. ఎదుటివారి మాటలను ఎక్కువగా పట్టించుకుంటారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2
కలిసి వచ్చేరంగు: పసుపు పచ్చరంగు
లక్ష్మీ ధ్యానం శుభాన్ని కలిగిస్తుంది.
సింహరాశి: చపల చిత్త ప్రవర్తనతో వ్యవహరిస్తారు. మాటల్లో స్పష్టత కోల్పోతారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు. రుణ ప్రయత్నాలు విఫలమవుతాయి. పీడ కలల ప్రభావం మీ ఆలోచనల రూపంలో వెంటాడుతాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: గోల్డ్ కలర్
గణపతి ధ్యానం వల్ల ఏకాగ్రత కుదురుతుంది.
కన్యారాశి: మాటిమాటికీ ఎదుటివారితో కయ్యానికి కాలు దువ్వుతారు. పని చేసే చోట గొడవలు. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. జీవిత భాగస్వామికి అనారోగ్యం కారణంగా అస్వస్థత ఏర్పడుతుంది. మీ పై అధికారుల అండదండలు ఉంటాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 6
కలిసి వచ్చేరంగు: గోధుమ రంగు
ఆంజనేయస్వామికి వెన్నపూసను సమర్పించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భాగ్య స్థాన గ్రహాలు యోగిస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేస్తారు. నిత్యం వాడాల్సిన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. శరీరంపై గాయాలు ఏర్పడుతాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2
కలిసి వచ్చేరంగు: తెలుపు రంగు
శివాలయంలో ఆవుపాలతో అభిషేకం జరిపించండి.
వృశ్చికరాశి: జీవితంలో ఆర్థికాభివృద్ధికై కొత్త మార్గాలలో అన్వేషణ ప్రారంభిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మతిమరుపు వల్ల ముఖ్యమైన వస్తువులు పారేసుకుంటారు. ప్రతీ విషయం మీ తల్లితండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోండి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 4
కలిసి వచ్చేరంగు: గుమ్మడిపండు రంగు
దుర్గాదేవిని దర్శించుకుని పసుపు, కుంకుమ, గాజులు సమర్పించండి.
ధనస్సురాశి: సౌమ్యమైన మీ మాట తీరుతో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. చేయాల్సిన పనుల్లో అలసత్వం పనికిరాదు. భూ విక్రయ లావాదేవీలు జరుపుతారు. స్త్రీ పరిచయం వల్ల ఆర్థిక సంతృప్తి కలుగుతుంది. నిజాయితీగా వ్యవహరించండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: నెమలిపించం రంగు
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభం కలిగిస్తుంది.
మకరరాశి: ఆరోగ్య సమస్యలు, ఎముకలకు, నరాలకు సంబంధించిన బాధ అనుభవిస్తారు. మీ మాటలు ఎదుటివారిని బాధకు గురి చేస్తాయి. లక్ష్మీకటాక్షం ఉంటుంది. రుణాలు ఇస్తారు. మానసికంగా ఆందోళనకు గురవుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1
కలిసి వచ్చేరంగు: గంధం రంగు
నాగదేవతను దర్శించి పాయసం నివేదించండి.
కుంభరాశి: మూర్ఖపు ప్రవర్తన వల్ల నష్టాల పాలవుతారు. ఎదుటి వారు చెప్పేది వినండి. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. సంతాన సహకారం ఉంటుంది. ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుందో లేదో అని ఆందోళన చెందుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6
కలిసి వచ్చేరంగు: కాఫీ రంగు
మహాలక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకోండి. పచ్చకర్పూరం అష్టగంధం సమర్పించండి.
మీనరాశి: వృత్తి, ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. ప్రయాణలలో జాగ్రత్తలు పాటించండి. కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆర్థికంగా సంతృప్తిగా ఉంటారు. అవసరాలకు డబ్బు అందుతుంది.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7
కలిసివచ్చే రంగు: పసుపు పచ్చరంగు
రావిచెట్టు దగ్గర ఖండశర్కర నైవేద్యంగా సమర్పించండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే