War 2 Pre release: ఎన్టీఆర్(Ntr) నటించిన తాజా చిత్రం వార్ 2(War 2). ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తాను ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లకు రావడానికి పెద్దగా ఇష్టపడటం లేదని తెలిపారు. అయితే అందుకు గల కారణాన్ని కూడా ఎన్టీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు బాద్షా సినిమా ఈవెంట్ సమయంలో ఒక అభిమాని మరణించిన నేపథ్యంలోనే తాను ఇలా పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనడానికి ఇబ్బంది పడుతున్నానని వెల్లడించారు.
నాగ వంశీ బలవంతం మేరకే..
ఇక ఇప్పుడు కూడా నాగ వంశీ బలవంతం చేస్తేనే ఇక్కడికి వచ్చానని అలాగే తన సినీ జర్నీ 25 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో అందరిని కలవాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చానని ఎన్టీఆర్ తెలిపారు. తాను అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా వేడుకకు రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను కానీ విధి మాత్రం ఆయన దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. అయాన్ ఎంతో అద్భుతంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని వెల్లడించారు. 25 సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్(Hrithik Roshan) గారు నటించిన మొదటి సినిమాలో ఆయన చేసిన డాన్స్ చూసి తనను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను ఇన్నాళ్లకు తనతో కలిసి డాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఈ అవకాశాన్ని కల్పించిన చిత్ర బృందానికి ఈ సందర్భంగా తారక్ ధన్యవాదాలు తెలిపారు.
నన్నెవరూ ఆపలేరు…
తాను తన మొదటి సినిమా పూజా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తన పక్కన అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. కానీ ఈరోజు ఎంతోమంది నాకు అండగా నా కుటుంబ సభ్యులుగా మీరు ఉన్నారని ఎన్టీఆర్ వెల్లడించారు. తనపై ఎప్పుడు తన తండ్రి హరికృష్ణ గారు, తన అన్నయ్య జానకిరామ్ గారి ఆశీస్సులు ఉంటాయని అలాగే కళ్యాణ్ రామ్ గారి అండదండలు ఉంటాయని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాపై ఉన్నన్ని రోజులు నన్నెవరూ ఆపలేరు. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న దర్శకులకు, నిర్మాతలకు అభిమానులకు నా పాదాభివందనాలు . అంతా ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా తారక్ ఎమోషనల్ అయ్యారు.
బొమ్మ అదిరిపోయింది… పండగ చేసుకోండి..
ఇక అభిమానులుగా నా కుటుంబ సభ్యులుగా నేను చేసిన తప్పులను క్షమిస్తూ.. బాధతో నేను కన్నీళ్లు కారిస్తే మీరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నా ఆనందంలో భాగమయ్యారు. నాకోసం మీరు చేసిన ప్రార్థనలకు ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన అభిమానులకు దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ సినిమా గురించి ఎవరెన్నీ మాట్లాడుకున్నా పర్లేదు బొమ్మ అదిరిపోయింది. పండగ చేసుకోండి అంటూ కాలర్ ఎత్తి మరి అభిమానులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ స్పీచ్ తో అభిమానులలో కూడా తెలియని ఉత్సాహం నెలకొనడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలు కూడా పెరిగిపోయాయి.
Also Read: War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!