War 2 Pre release: ఎన్టీఆర్(NTR) హృతిక్ రోషన్ (Hrithik Roshan)హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వార్ 2(War 2). ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హృతిక్ రోషన్ కూడా హాజరు కావడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
నాకు తమ్ముడితో సమానం..
ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కష్టపడ్డారనే విషయాలను హృతిక్ రోషన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో నాతోపాటు ఒక కోస్టార్ గా తన జర్నీ మొదలుపెట్టారు కానీ సినిమా పూర్తి అయ్యేలోపు నాకు తమ్ముడిలా మారిపోయాడని వెల్లడించారు. “తారక్ మీకు అన్న అయితే నాకు తమ్ముడు లాంటివాడు” అంటూ తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడని, తనని స్ఫూర్తిగా తీసుకొని తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని హృతిక్ రోషన్ వెల్లడించారు.
ఎన్టీఆర్ మొండి మనిషి…
ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు ఎన్నో గాయాలు అయ్యాయి. కానీ ఎన్టీఆర్ లాంటి ఒక మొండి మనిషిని చూసిన తర్వాత ఆ గాయాలు చాలా చిన్నవిగా అనిపించాయి. ఇలా గాయాలు తగిలిన ఎన్టీఆర్ ని చూస్తున్నప్పుడు వాటిని లెక్క చేయకుండా పనిచేయాలనిపించేదని ఈ సందర్భంగా ఎన్టీఆర్ డెడికేషన్ గురించి ఆయన నటన గురించి హృతిక్ రోషన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా కెరియర్ పరంగా మా ఇద్దరి జర్నీ ఒకటే అని తెలిపారు ఇద్దరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని వెల్లడించారు.
వన్ టేక్.. ఫైనల్ టేక్ స్టార్….
ఎన్టీఆర్ “వన్ టేక్.. ఫైనల్ టేక్ స్టార్” అంటూ తారక్ గురించి తెలియజేశారు. ఒకే టేక్ లోనే షాట్ పూర్తి చేస్తారు అంటూ ఈ సందర్భంగా హృతిక్ రోషన్ వెల్లడించారు.ఇలా ఎన్టీఆర్ నటన గురించి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పట్ల ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే వార్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read: War 2 Pre Release: అరగంట తర్వాతే ఎన్టీఆర్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అయాన్!