Rahul Dravid : టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సాధారణంగా బ్యాట్స్ మెన్లు మైదానంలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను అతడు చేసిన పరుగులను బట్టి కొలుస్తాం. ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. అంత బాగా ఆడినట్టు భావిస్తుంటాం. అయితే టెస్ట్ మ్యాచ్ ల్లో మాత్రం ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అంత బాగా ఆడినట్టు లెక్క. అయితే జట్టును ఓటమి నుంచి తప్పించాలంటే బ్యాటర్ క్రీజులో ఎక్కువ సేపు ఉండాల్సిందే. అలాంటి ఎన్నో ఇన్నింగ్స్ లు ఆడిన రాహుల్ ద్రావిడ్ ను అందుకే ది వాల్ అని పిలిచే వారు. ముఖ్యంగా 2007లో ఆస్ట్రేలియయాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, బ్రాడ్ హగ్, ఆండ్రూ సైమండ్స్ వంటి టాప్ క్లాస్ బౌలర్లకు రాహుల్ ద్రావిడ్ చుక్కలు చూపించాడు.
Also Read : Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!
92 బంతులు.. ఒక్క పరుగు మాత్రమే
మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 92 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక అదే సిరీస్ లో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ద్రావిడ్ డిఫెన్స్ కి ఆస్ట్రేలియా అభిమానులు సైతం మంత్రముగ్దులయ్యారు. ఇక సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 96 బంతులు ఆడిన ద్రావిడ్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆ తరువాత ఒక్క పరుగులు చేసేందుకు ఏకంగా 40 బంతులు ఆడాడు. అంటే 18 నుంచి 19 పరుగులు రావడానికి ద్రావిడ్ 40 బంతులు ఆడాడు. ఆ పరుగు చేసిన తరువాత అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో ద్రావిడ్ సహనాన్ని అభినందించారు. అలాంటి రాహుల్ ద్రావిడ్ హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టాడంటే ఎవ్వరైనా నమ్ముతారా..? అవునండి అది వాస్తవం.
రాహుల్ హ్యాట్రిక్ సిక్స్ లు..
2007లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తన తొలి, చివరి టీ-20 మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్ వరుసగా హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాహుల్ వరస సిక్స్ లు కొట్టాడా..? అని తెగ చర్చించుకోవడం గమనార్హం. ఎందుకంటే.. ఎప్పుడైనా ద్రవిడ్ కాస్త నిలకడగా ఆడుతుంటాడు. ఆటగాళ్లందరూ ఔట్ అయినా.. ద్రావిడ్ ని ఔట్ చేయాలంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అలా క్రికెట్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఇప్పుడున్న క్రికెటర్లందరినీ తయారు చేశాడు. అండర్ -19 జట్టుకి కోచ్ గా ఉన్న సమయంలోనే ప్రస్తుతం ఉన్న టీమిండియా ని తయారు చేశాడంటే.. అది రాహుల్ క్రెడిట్ అనే చెప్పవచ్చు. రాహుల్ ద్రావిడ్ 100 సంవత్సరాలు నిలిచి ఉండే ఒక రికార్డు కూడా ఈ టెస్ట్ లో చేరింది. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన రికార్డు ద్రావిడ్ పేరిట ఉన్నది. రాహుల్ రికార్డును జో రూట్ బ్రేక్ చేశాడు. కేవలం 156 మ్యాచ్ ల్లోనే కావడం విశేషం.
?igsh=d3J0OGgzaG9iaWxn