BigTV English

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

War 2 Pre Release Event :  ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

War 2 Pre Release Event :  జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ సినిమాలో హీరోయిన్ గా కియార అద్వానీ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ అంటే మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృంద సభ్యులందరూ ప్రమోషన్స్ పై పూర్తిగా డిపెండ్ అయిపోయారు. నిద్ర లేకుండా.. ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాదులో కూడా వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


Also Read : Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

కాలర్ ఎగుర వేసిన ఇద్దరు హీరోలు


వార్ 2 సినిమా రిలీజ్ కు సమయం ఏమాత్రం లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఉన్న సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి… రచ్చ చేశారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. ఎన్నడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే స్పీచ్ కూడా ఇచ్చారు. గతంలో తన సొంత సినిమాకు కూడా ఇవ్వని స్పీచ్… జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వడం గమనార్హం.

కూలి సినిమా పోటీగా ఉన్న నేపథ్యంలో… ఈ ఇద్దరు హీరోలు కాస్త తెగించేశారు. అందుకే హైదరాబాదులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రెండు కాలర్స్ ఎగరవేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూసి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ కూడా తన రెండు కాలర్స్ ఎగరవేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కాలర్ ఎగరవేయడం హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

కూలికి పోటీగా వార్ 2

నిన్నటి వరకు రజనీకాంత్ నటించిన కూలి సినిమాకు మంచి బజ్ ఉండేది. కానీ ఇవాళ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా…వార్ 2 మళ్లీ పికప్ లోకి వచ్చింది. ఇదే జోరు సినిమా రిలీజ్ అయ్యే వరకు కొనసాగిస్తే ఖచ్చితంగా.. కలెక్షన్స్ జోరుగా వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ ఇద్దరూ రంగంలోకి దిగి కాలర్ ఎగరవేయడంతో సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది. అయితే రజినీకాంత్ , అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్ మరియు పూజా హెగ్డే నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తట్టుకొని నిలబడాలనే.. ఇవాళ జరిగిన ఈవెంట్లో… జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ ఇద్దరు చాలా కష్టపడ్డారు అని చెప్పవచ్చు. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Related News

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×