BigTV English

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోలుగా నటించిన చిత్రం వార్ 2(War 2). ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా హైదరాబాద్లో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా హాజరై సందడి చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తన 25 సంవత్సరాల సినీ జర్నీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


ఇక్కడి నుంచి వెళ్లిపోనా?

చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఇలా తన సినిమాకు సంబంధించిన మీటింగ్ కు హాజరు కావడంతో అభిమానులు(Fans) కూడా అత్యుత్సాహం కనబరిచారు. ఇలా ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున గోల చేస్తూ కేకలు వేయడంతో ఎన్టీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇదివరకే మీకు చెప్పాను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండాలని… కానీ అలాగే గోల చేస్తున్నారు ఇక్కడి నుంచి నేను వెళ్ళి పోనా.. మైక్ పక్కన పెట్టి వెళ్లిపోవడానికి ఒక్క క్షణం చాలు వెళ్లిపొమ్మంటారా? అంటూ అభిమానుల తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.


దయచేసి ట్విస్టులు చెప్పకండి..

ఇలా ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో అభిమానులు కూడా పరిస్థితి అర్థం చేసుకొని సైలెంట్ అయ్యారు. ఇక తన 25 సంవత్సరాల సినీ జర్నీ గురించి అలాగే వార్ 2 సినిమా గురించి ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కూడా అభిమానులను ఉద్దేశించి గొప్పగా మాట్లాడారు. ఒక కడుపున పుట్టకపోయినా మీరందరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని ఈ జన్మకు మీ ఋణం తీర్చుకోలేనని అభిమానుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమా చూసిన తర్వాత సినిమాలో ఉన్న ట్విస్టులు మాత్రం బయటకు చెప్పకండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

బొమ్మ అదిరిపోయింది…

ఇక మన సినిమా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏం చేయలేదని, బొమ్మ అదిరిపోయింది పండగ చేసుకోండి అంటూ ఏకంగా రెండు కాలర్లను పైకి ఎత్తి సినిమా పట్ల ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ చూపించారు. ఇలా ఎన్టీఆర్ మాట తీరు చూస్తుంటే మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుందని అలాగే ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో అని అభిమానులలో మరింత ఆత్రుత నెలకొంది. ఇక మొదటిసారి బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా మరొక నాలుగు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: War 2 Pre release: ఆయన ఆశీస్సులు ఉంటే నన్ను ఎవరు ఆపలేరు… ఎన్టీఆర్ పవర్ ఫుల్ స్పీచ్!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×