IRCTC offer: చరిత్ర, ఆధ్యాత్మికత, సముద్ర తీర అందాలు ఇవన్నీ ఒక్కరోజులోనే చూడాలా? మరి ఆలస్యం ఎందుకు? IRCTC తెచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయితే మరీ మిస్ అన్నమాట. అందుకే ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి.
ఒకే రోజు టైంలోనే పల్లవుల కాలపు వైభవం, శిల్ప కళల అద్భుతం, సముద్ర తీరపు సుందర దృశ్యాలు, ఆలయాల ఆధ్యాత్మికత.. ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి IRCTC సూపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ.1980 లకే కాంచీపురం – మహాబలిపురం డే టూర్ చేసేయవచ్చు.
ప్రయాణం ఎలా ఉంటుంది?
ఉదయం రుచికరమైన అల్పాహారం తర్వాత, చెన్నై నుంచి సిల్క్ సిటీ కంచీపురం వైపు ప్రయాణం మొదలవుతుంది. 7వ నుంచి 8వ శతాబ్దంలో పాలవుల రాజధానిగా వెలుగొందిన ఈ ప్రదేశం, కళలు, చరిత్ర, ఆధ్యాత్మికతల సమ్మేళనం. మొదట దర్శనం ఏకాంబరేశ్వరర్ ఆలయంలోనే. పంచభూత స్థలాలలో భూమి తత్వాన్ని సూచించే ఈ ఆలయం 57 మీటర్ల ఎత్తైన గోపురం కోసం ప్రసిద్ధి. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది.
ఆలయంలోని ఆయిరం కాళ్ మండపం అంటే వెయ్యి స్తంభాల మంటపం చూడటానికి సమయం సరిపోని తీరు ఉంటుంది. ఇక్కడి గోడలపై 1008 శివలింగాలు అందంగా చెక్కబడి ఉంటాయి. తర్వాత పట్టణ హృదయంలోని కామాక్షి అమ్మవారి ఆలయ దర్శనం. ఇది శక్తి పీఠాలలో ఒకటి. బంగారు గోపురం, అమ్మవారి ఆరాధన వాతావరణం.. భక్తులకు మధురానుభూతి కలిగిస్తాయి.
మధ్యాహ్నం తర్వాత మహాబలిపురం
లంచ్ అయ్యాక, పల్లవుల సముద్రతీర నౌకాశ్రయం అయిన మహాబలిపురం వైపు బయలుదేరతారు. ఇక్కడి రాతి శిల్పాలు, గుహాలయాలు, సీషోర్ టెంపుల్.. ఇవన్నీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తించబడ్డాయి. సముద్ర అలల సవ్వడితో పాటు పల్లవుల శిల్పకళ ఆడిన మంత్రముగ్ధం చేసే ఆటను చూసి ఆశ్చర్యపోతారు.
ప్యాకేజ్ ముఖ్యాంశాలు
AC వాహనంలో రోడ్డు ప్రయాణం
అనుభవజ్ఞులైన డ్రైవర్‌తో సేఫ్ ట్రిప్
క్యాబ్ సర్వీస్, బీమా సదుపాయం
వారంలోని ఏ రోజైనా ప్రయాణం
టికెట్ ధర వివరాలు (ప్రతి వ్యక్తికి)
1-3 మంది – సెడాన్: ట్రిపుల్ షేరింగ్ రూ. 1980/-
4-6 మంది – ఇన్నోవా: ట్రిపుల్ షేరింగ్ రూ. 1660/-
ఎందుకు మిస్ కాకూడదు?
ఒకే రోజులో రెండు చారిత్రక, ఆధ్యాత్మిక నగరాల సందర్శనం, సౌకర్యవంతమైన వాహనం, తక్కువ ఖర్చు.. ఇవన్నీ కలిపి ఇంత మంచి ఆఫర్ మరెక్కడా దొరకదు. ఈ ట్రిప్ కేవలం పర్యటన మాత్రమే కాదు, మన చరిత్రలోకి, మన సంప్రదాయాల్లోకి, మన కళలలోకి చేసే ఒక అద్భుత ప్రయాణం. మొత్తం మీద IRCTC ఇచ్చిన ఈ ఛాన్స్ నిజంగా గోల్డెన్. రూ. 1980లో ఇంత వైభవాన్ని చూడడం అంటే అరుదైన అదృష్టం. కాబట్టి, ఈ టూర్ బుక్ చేసుకోవడంలో ఆలస్యం చేయకండి. పూర్తి వివరాల కోసం irctc వెబ్ సైట్ చూసేయండి.