Abhisekh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా అభిషేక్ బచ్చన్ (Abhisekh Bachchan)హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న అభిషేక్ బచ్చన్ ఇటీవల తన సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా సినిమాలను తగ్గించిన ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ పలు సందర్భాలలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా అభిషేక్ బచ్చన్ కొత్త సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అసోసియేట్ డైరెక్టర్ …
అభిషేక్ బచ్చన్ త్వరలోనే కొత్త సినిమా ప్రకటించబోతున్నారని సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy)వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్(Spirit) సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి దగ్గర పలువురు డైరెక్షన్లో శిష్యరికం పొందారు. ఇలా సందీప్ రెడ్డి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన షణ్ముఖ గౌతమ్ (Shanmukh Gautham)ఘంటసాల దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈయన తన మొదటి సినిమాని అభిషేక్ బచ్చన్ తో చేయబోతున్నట్టు సమాచారం
డైరెక్టర్ గా సందీప్ శిష్యుడు..
అభిషేక్ బచ్చన్ షణ్ముఖ గౌతమ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇందులో అభిషేక్ బచ్చన్ చాలా వైల్డ్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. షణ్ముఖ గౌతమ్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలకు అసోసియేటెడ్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఈయన దర్శకుడుగా తన మొదటి సినిమాని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో రాబోతున్నట్టు తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
టాలీవుడ్ ఇండస్ట్రీలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ నిర్మాణ సంస్థ ఇటీవల జాత్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . ఈ క్రమంలోనే పీపుల్స్ మీడియా వారి నిర్మాణంలోని అభిషేక్ షణ్ముఖ్ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ ఏడాది చివరికి షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సందీప్ శిష్యుడు, యాక్షన్ సినిమా అంటే మరో యానిమల్ (Animal) తరహాలో ఈ చిత్రం ఉండబోతుందని భావిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి ప్రస్తుతం స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
Also Read: Thammudu Film: తమ్ముడు ఫస్ట్ ఛాయిస్ నితిన్ కాదా.. ఆ హీరో రిజెక్ట్ చేస్తేనే చాన్సా?