E-Paper
Advertisement

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!
Advertisement

Ramayan Pre Release: బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం రామాయణ(Ramayana). ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

టాక్సిక్ సరిగ్గా ఆడలేదు కానీ..

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) పాల్గొన్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల  డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ కార్యక్రమంలో భాగంగా రామాయణ సినిమా గురించి మాట్లాడారు. అదే విధంగా యశ్ (Yash) టాక్సిక్(Toxic)  డిజాస్టర్ గురించి కూడా ఈయన మాట్లాడారు. టాక్సిక్ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్నారు అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ నష్టాలను పూడ్చడం కోసం యష్ రామాయణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా దిల్ రాజుకు ఇచ్చారు.

ప్రతి కథకి విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ..కర్ణాటకలో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ యశ్ హీరోగా ఎదుగుతూ ఈరోజు ఇండియన్ సినిమా దాటి రామాయణ సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నారని దిల్ రాజు తెలిపారు.. ఇటీవలనే టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ ఆ సినిమా కోసం యశ్ నాలుగు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డారని, దిల్ రాజు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రతి సినిమాకి, ప్రతి కథకి విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి. విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుందనీ తెలిపారు. ఇక రామాయణ సినిమాలో యశ్ విలన్ గా రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

రామాయణ ఒక ప్రెస్టీజియస్ ఫిలిం..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామాయణ సినిమా గురించి కూడా దిల్ రాజు మాట్లాడుతూ.. రామాయణం ఒక ప్రెస్టీజియస్ ఫిలిం.3D లో నాకు కొన్ని ఎపిసోడ్స్ చూపించారు.. మైండ్ బ్లోయింగ్ వీఎఫ్ఎక్స్ అనగానే హాలీవుడ్ సినిమాలే గుర్తుకొస్తాయి.కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా కొనసాగుతున్న మన రాజమౌళి గారు వీఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ ని హాలీవుడ్ వరకు తీసుకెళ్ళారని ఈ సందర్భంగా రాజమౌళి గురించి దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

Related News

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

Big Stories

Advertisement
×