E-Paper
Advertisement

పావలా శ్యామల కోసం రంగంలోకి దిల్ రాజు .. అసలు ఏం జరిగిందంటే?

పావలా శ్యామల కోసం రంగంలోకి దిల్ రాజు .. అసలు ఏం జరిగిందంటే?
Advertisement

Pavala Shyamala : టాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో తనదైన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వించిన నటి పావలా శ్యామల. ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘బాబాయ్ హోటల్’, ‘గోలీమార్’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ మూవీ లవర్స్ కి గుర్తే. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ (2002) సినిమాలో ఆమె పండించిన హాస్యం అంతా ఇంతా కాదు.అయితే, వెండితెరపై అంతలా నవ్వించిన ఈ సీనియర్ నటి.. నిజజీవితంలో మాత్రం తీవ్రమైన విషాదాన్ని, పేదరికాన్ని అనుభవిస్తోంది.

సమస్యలతో సతమతమవుతున్న పావలా శ్యామల

Advertisement

గత కొంతకాలంగా అనారోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పావలా శ్యామల పరిస్థితి తాజాగా మరింత దయనీయంగా మారింది. ఈ కష్ట సమయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG FDC) చైర్మన్ దిల్ రాజు ఆమెకు అండగా నిలిచి, రియల్ హీరో అనిపించుకున్నారు.గత రాత్రి పావలా శ్యామల తీవ్ర గుండె సంబంధిత సమస్యతో పాటు ఇతర ఆరోగ్య కారణాలతో బాధపడుతూ.. ప్రాథమిక చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే, కనీసం ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించి, బయటకు పంపించేసింది.

also read :సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. రంగంలోకి కమల్ హాసన్, నడిగర్ సంఘం.. కోలీవుడ్‌లో పండగే!

Advertisement

అంతటితో ఆగకుండా, ఆమెను తీసుకువచ్చిన క్యాబ్ డ్రైవర్ కూడా మానవత్వాన్ని మరిచి అర్థరాత్రి వేళ నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్ళిపోయాడు. వయసు మళ్ళిన వృద్ధురాలు, అందులోనూ తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్న ఒక సీనియర్ నటి నడిరోడ్డుపై ఒంటరిగా విలవిలలాడిపోతున్న వీడియోలు , ఫోటోలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ దారుణ పరిస్థితిని చూసి  పరిశ్రమ పెద్దలు స్పందించాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు కూడా.

దిల్ రాజు స్వయంగా ప్రసాద్ హాస్పిటల్ వైద్యులకు ఫోన్

ఇక వార్త సోషల్ మీడియా ద్వారా దిల్ రాజు దృష్టికి వెళ్ళింది. స్పందించిన ఆయన, క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. తన ప్రత్యేక మేనేజర్ల బృందాన్ని అలర్ట్ చేసి, ఆమె ప్రస్తుతం ఎక్కడుందో కనుక్కోవాలని ఆదేశించారు. దిల్ రాజు టీమ్ గ్రౌండ్ లెవల్‌లో వేగంగా శోధించి, ప్రస్తుతం ఆమె కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చేరి చికిత్స పొందుతున్నట్లు ట్రేస్ చేసింది. విషయం తెలిసిన వెంటనే దిల్ రాజు స్వయంగా ప్రసాద్ హాస్పిటల్ వైద్యులకు ఫోన్ చేసి, ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

also read :‘పెద్ది’ నుంచి ‘సోల్ ఆఫ్ అప్పలసూరి’.. జగపతిబాబు గ్లింప్స్ మామూలుగా లేదుగా!
వైద్యులతో మాట్లాడిన దిల్ రాజు, “శ్యామల గారికి అవసరమైన పూర్తిస్థాయి, మెరుగైన వైద్య చికిత్సను అందించండి. దీనికి సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నా, ఎంత ఖర్చయినా నా మేనేజర్లు చూసుకుంటారు. నా టీమ్ నిరంతరం మీతో టచ్‌లో ఉంటుంది, నేనూ అందుబాటులో ఉంటాను” అని హాస్పిటల్ యాజమాన్యానికి స్పష్టమైన భరోసా ఇచ్చారు. దిల్ రాజు ఆదేశాలతో ఆయన మేనేజర్లు నేరుగా ఆసుపత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడారు

నా జీవితాంతం రుణపడి ఉంటాను

దిల్ రాజు బృందం ఆసుపత్రిలో పావలా శ్యామలను పరామర్శించిన సమయంలో ఒక ఎమోషనల్ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న పావలా శ్యామల, దిల్ రాజు చేసిన ఈ సహాయానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. “దిల్ రాజు గారు నాకు గతంలోనూ చాలా సార్లు ఆర్థికంగా, వైద్య పరంగా ఎంతో సహాయం చేశారు. ఇండస్ట్రీలో నన్ను అందరూ మరిచిపోయిన వేళ, నడిరోడ్డుపై చావు బతుకుల మధ్య ఉన్న నాకు మరోసారి దేవుడిలా అండగా నిలిచారు. ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. కష్టాల్లో ఉన్న సీనియర్ నటిని సకాలంలో ఆదుకుని, మానవత్వాన్ని చాటుకున్న దిల్ రాజుని ఇపుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారంతా !

also read :మహేష్ బాబు రెస్టారెంట్‌లో ఘోరమైన దోపిడీ.. బిల్లు చూస్తే గుండె ఆగాల్సిందే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×