CM Vijay : ఎన్నో ఏళ్లుగా తనవైన సినిమాలతో అభిమానులని అలరించిన దళపతి విజయ్ గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సెక్రటేరియట్‌లో నడిగర్ సంఘం ప్రతినిధులు, విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమలో ఒకడైన స్టార్ హీరో రాష్ట్రానికి లీడర్ కావడంతో కోలీవుడ్ వర్గాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.
పూర్తిగా నిలిచిపోయిన ‘ఎర్లీ మార్నింగ్ షోస్
ముఖ్యమంత్రితో జరిగిన ఈ మీటింగ్‌లో నడిగర్ సంఘం అధ్యక్షుడు, సీనియర్ యాక్టర్ నాసర్ నాయకత్వంలో హీరో కార్తీ, పూచి మురుగన్, కరుణాస్ తదితరులు సీఎం విజయ్‌కు తమ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సీఎం విజయ్ ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పారు. శాంతిభద్రతల కారణాల వల్ల గత కొన్నేళ్లుగా తమిళనాడులో పూర్తిగా నిలిచిపోయిన ‘ఎర్లీ మార్నింగ్ షోస్’ (ఉదయం 9 గంటల ఆటలు) మళ్ళీ వేసుకోవడానికి పచ్చ జెండా ఊపారు. గతంలో విజయ్ నటించిన ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) వంటి బిగ్గెస్ట్ సినిమాల రిలీజ్ సమయంలో ఈ స్పెషల్ షోస్ కోసం ఫ్యాన్స్, థియేటర్ల ఓనర్స్ ఎంతగానో ఎదురుచూశారు . ఇప్పుడు సినీ కష్టాలు తెలిసిన వ్యక్తే సీఎం కావడంతో, ఆయన తీసుకున్న ఈ స్పెషల్ డెసిషన్ పట్ల ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
#CMVijay | தமிழ்நாடு முதலமைச்சர் விஜய் சந்தித்து வாழ்த்து தெரிவித்த நடிகர் சங்க நிர்வாகிகள்.#Vijay | #Karthi pic.twitter.com/mJ8YHWRXt1
— Senthilraja R (@SenthilraajaR) May 15, 2026
also read :మహేష్ బాబు రెస్టారెంట్‌లో ఘోరమైన దోపిడీ.. బిల్లు చూస్తే గుండె ఆగాల్సిందే!
అలాగే కోలీవుడ్‌లో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను నాసర్, కార్తీ బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ సినీ అవార్డులను (State Film Awards) ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించాలని, చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం విజయ్ సానుకూలంగా స్పందిస్తూ, తనని ఎంతగానో ఆదరించిన సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చాడని తెలుస్తుంది.
లోకనాయకుడు మీట్స్ దళపతి
ఇక నడిగర్ సంఘం తర్వాత, విశ్వనాయకుడు కమల్‌హాసన్ సైతం నూతన సీఎం విజయ్‌ను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు పంచుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కమల్ ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ కన్న కలలు, ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఈ భేటీలో ఆయన చూపిన అణకువ, ఆప్యాయత తనను ఎంతగానో గర్వపడేలా చేశాయని కమల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వ సాయం అవసరమని చెప్తూ.. ఒక ఆరు ముఖ్యమైన డిమాండ్‌లను సీఎం విజయ్ ముందు ఉంచినట్లు కమల్ వెల్లడించారు. అయితే ఆ డిమాండ్లు ఏంటనేది మాత్రం ఆయన సస్పెన్స్‌గా ఉంచారు. ఇదే సమయంలో సీఎం విజయ్‌కు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ అనే రెండు చారిత్రాత్మక పుస్తకాలను కమల్ బహుమతిగా అందించడం విశేషం.
also read :సైలెంట్‌గా ఉంటే రెచ్చిపోతారా..? వల్గర్ కామెంట్‌పై కన్నడ బ్యూటీ ఫైర్
ఇంకెన్ని రెవల్యూషన్స్ కి తెర తీయనున్నాడో
‘తుపాకీ’, ‘కత్తి’, ‘మెర్సల్’, ‘మాస్టర్’ వంటి ఇండస్ట్రీ హిట్లతో వెండితెరను ఏలిన దళపతి, ఇప్పుడు రియల్ లైఫ్ లీడర్‌గా ఎలాంటి పాలన అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా వాళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం విజయ్ ఇచ్చిన హామీతో కోలీవుడ్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయనే చెప్పాలి.చూడాలి ముందు ముందు విజయ్ కోలీవుడ్ లో ఇంకెన్ని రెవల్యూషన్స్ కి తెర తీయనున్నాడో !