E-Paper
Advertisement

Sivaji: దిగొచ్చిన శివాజీ.. ప్రభావం గట్టిగానే పడిందే!

Sivaji: దిగొచ్చిన శివాజీ.. ప్రభావం గట్టిగానే పడిందే!
Advertisement

Sivaji:ప్రముఖ హీరో శివాజీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. అద్భుతమైన కామెడీ పండిస్తూ ఊహించని ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.. అలాంటి ఈయన కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి మళ్లీ 90స్ వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసింది. దీనికి తోడు గత ఏడాది వచ్చిన ‘ కోర్టు’ సినిమాలో విలన్ గా నటించి తన విలక్షణమైన నటనతో అందరిని అబ్బురపరిచారు. అలాంటి ఈయన తాజాగా నిర్మాతగా మారి స్వయంగా నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’.

వివాదంలో చిక్కుకున్న శివానీ..

శివాజీ తన సొంత నిర్మాణ సంస్థ “శ్రీ శివాజీ ప్రొడక్షన్స్” పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కూడా. ఇందులో లయ(Laya ) మరోసారి శివాజీకి జంటగా నటిస్తుండగా.. ప్రిన్స్, ఆలీ , ధనరాజ్ , ఇమ్మానుయేల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుదీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. రంజిన్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా 12వ తేదీన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిట్ మిషన్ గా పేరుపొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలోనే శివాజీ గురించి అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక మొత్తానికి శివాజీ దిగొచ్చారు. అందుకే ఇకపై జాగ్రత్తగా ఉంటానని చెబుతున్నారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపై అలాంటి మాటలు మాట్లాడను – శివాజీ

Advertisement

విషయంలోకి వెళ్తే.. గత ఏడాది ‘దండోరా’ సినిమా ప్రమోషన్ సమయంలో మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆయన ఆ విషయాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ‘ సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా అనిల్ రావిపూడిని పిలవడానికి శివాజీ ఫోన్ చేయగా.. అనిల్ రావిపూడి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ సరదా సంభాషణ సాగిందట. దీనిపై అనిల్ రావిపూడి తో శివాజీ మాట్లాడుతూ..” గతంలో దండోరా ఈవెంట్ కి వచ్చి వివాదాల్లో ఇరుక్కున్నాను. ఇప్పుడు మళ్లీ రమ్మంటే ఏమనుకుంటారో అని భయపడ్డాను. పైగా ఈసారి నేను అలాంటి కామెంట్స్ చేయను. చాలా బుద్ధిగా ఉంటాను” అని తనతో చెప్పినట్టు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

ALSO READ:Jabardasth Comedian: లక్షల్లో నష్టం.. యూట్యూబ్ ఛానెల్ ను అమ్మేస్తున్న జబర్దస్త్ కమెడియన్?

ఆచితూచి అడుగులు వేస్తానంటున్న శివాజీ..

Advertisement

మొత్తానికైతే దండోరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఇకపోతే ఈ సమయంలోనే శివాజీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ అనసూయ, నాగబాబు , చిన్మయి లాంటి వాళ్ళు విరుచుకుపడ్డారు. అటు లేడీ కమిషనర్ కూడా ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అప్పుడే ఆయన సారీ కూడా చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పిన శివాజీ.. అందుకు తగ్గట్టుగానే ఇకపై ఆచితూచి అడుగులు వేస్తానని తెలిపారు. స్త్రీ వస్త్రధారణ విషయంపై శివాజీ చేసిన కామెంట్లకు అప్పుడు జరిగిన సంఘటన దెబ్బ గట్టిగానే పడింది అని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం హీరోగా మళ్లీ సినిమా చేస్తున్న శివాజీ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×