Anil Ravipudi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). తాజాగా ఈయన ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే కొంతమంది చిరంజీవి యాంటీ అభిమానులు ఇది డాడీ, తులసి, విశ్వాసం సినిమాలకు దగ్గరగా ఉంది అని కామెంట్లు చేయగా.. మరికొంతమంది ఈ మూడు కథలను బేస్ చేసుకుని మన శంకర్ వరప్రసాద్ గారు స్క్రిప్ట్ ను అనిల్ సిద్ధం చేశారు అంటూ నెట్టింట పోస్ట్లు కూడా పెడుతున్నారు.
ఇకపోతే ఒకవైపు వరుసగా కలెక్షన్లు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంటే.. మరొకవైపు ఇలాంటి యాంటీ ఫ్యాన్స్ నెట్టింట చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రూమర్స్ పై స్పందించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” అజిత్ నటించిన విశ్వాసం సినిమా ఛాయలు మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా నయనతార(Nayanthara)నే నటించారు. ఇకపోతే విశ్వాసం సినిమా కథను పాప పాత్ర టర్న్ చేస్తుంది. అయితే అలాంటి కాన్సెప్ట్ కథతో తెలుగులో డాడీ సినిమా ఎప్పుడో వచ్చింది. నేను డాడీ మూవీ ని రిఫరెన్స్ గా తీసుకొని మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రాన్ని తెరకెక్కించాను. డాడీ సినిమాలో చిరంజీవి ఎమోషన్స్ బాగా పండించారు.. కానీ అనుకున్నంతగా ఆ సినిమా విజయం సాధించలేదు. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ చుట్టూ ఒక బలమైన కోటరీ లేకపోవడం వల్లే ప్రేక్షకులను మెప్పించలేదని నా అభిప్రాయం.
ALSO READ:Sirivennela: అనకాపల్లిలో సిరివెన్నెల కాంస్య విగ్రహావిష్కరణ.. త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్!
ఆ సినిమాలోని ప్రధాన కాన్సెప్ట్ ను రెఫరెన్స్ గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అంటూ ఓపెన్ గానే చెబుతున్నాను ఈ సినిమా మూలంతోనే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కించాను” అంటూ నిజాయితీగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మొత్తానికైతే అనిల్ రావిపూడి ఆ సినిమా నుండి మూలం తీసుకొని.. ఆడియన్స్ పల్స్ ను బాగా పట్టుకున్న అనిల్ రావిపూడి.. వారికి తగ్గట్టుగానే తనదైన స్టైల్ లో మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర కథను సిద్ధం చేసుకుని ప్రేక్షకులకు కావాల్సినంత స్టఫ్ ను అందించారు.ఇక ఎట్టకేలకు అందరినీ మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో నయనతార , వెంకటేష్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ చేశారు.