E-Paper
Advertisement

Sirivennela: అనకాపల్లిలో సిరివెన్నెల కాంస్య విగ్రహావిష్కరణ.. త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్!

Sirivennela: అనకాపల్లిలో సిరివెన్నెల కాంస్య విగ్రహావిష్కరణ.. త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Sirivennela:తెలుగు సాహిత్యానికి అద్దంలాంటి వ్యక్తులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. గేయ రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును.. ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న సిరివెన్నెలకు ఇప్పుడు విశేష గౌరవాన్ని అందించారు స్థానికులు.. అనకాపల్లి గాంధీ నగరంలో సీతారామశాస్త్రి పుట్టి పెరిగారు. ఇక ఆ ప్రాంతంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు.

త్రివిక్రమ్ చేతులమీదుగా సిరివెన్నెల కాంస్య విగ్రహ ఆవిష్కరణ.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగానే సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sstry) కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి, జోనల్ కమిషనర్ కే చక్రవర్తి, చేబ్రోలు శ్రీరామశాస్త్రి , పద్మావతి, ఎర్రాప్రగడ రామకృష్ణ, లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు బి శెట్టి బాబ్జి , తానాపూర్వ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..

Advertisement

కాంస్య విగ్రహ ఆవిష్కరణ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..” తెలుగు సాహిత్యానికి ఉత్తరాంధ్ర పురిటిగడ్డ.. గిడుగు రామ్మూర్తి, గురజాడ , శ్రీశ్రీ , రావిశాస్త్రి, రాచకొండ , సిరివెన్నెల వంటి ఎంతోమంది సాహిత్యకారులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు. సిరివెన్నెల సొంత ఊరిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. జయంతి, వర్ధంతిలకు పూలమాలలు వేయడానికి విగ్రహాలు కాదు.. మహానుభావులు చేసిన గొప్ప పనులు భావితరాలకు తెలియజేయడానికే సంకేతం” అంటూ త్రివిక్రమ్ తన మాటలుగా చెప్పుకొచ్చారు.. ఇంత గొప్ప వ్యక్తి కాంస్య విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

తెలుగు సాహిత్య ముద్దుబిడ్డ సిరివెన్నెల సీతారామశాస్త్రి..

తన అద్భుతమైన తెలుగు సాహిత్యంతో తెలుగు సాహిత్యానికే మరో పేరుగా నిలిచి ఎంతోమంది సాహిత్య ప్రియులను అలరించారు. తెలుగు సినిమా, నాటక రంగంలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ కవిగా, గేయ రచయితగా మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. 1986లో ‘అదే పేరుతో’ వచ్చిన చిత్రానికి పాటలు రాసి సిరివెన్నెల అనే రంగస్థలం పేరును సొంతం చేసుకున్నారు.. ఇక దక్షిణ భారత గేయ రచనలు అత్యధికంగా చేసిన రచనలకు గాను సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏకంగా 11 నంది అవార్డులను అందుకున్నారు. అలాగే 6 ఫిలిం ఫేర్ అవార్డ్స్ తోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 2020 వరకు సుమారుగా 3000 కంటే ఎక్కువ పాటలకు సాహిత్యం అందించారు. 2019లో కళలు , సౌందర్య శాస్త్ర రంగానికి ఆయన చేసిన సేవకు గానూ భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ఆయన అందుకోవడం జరిగింది.

Advertisement

ALSO READ:Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ రిలీజ్‌కు రెడీ, కానీ.. అదొక్కటే సమస్య

తండ్రి బాటలోనే అడుగు..

సిరివెన్నెల సీతారామశాస్త్రి అనకాపల్లిలో జన్మించారు. తన బాల్యం మొత్తం కాకినాడలోనే గడిపారు. అక్కడ ఆయన తండ్రి బహు భాషావేత్త అయిన చెంబోలు వెంకట యోగి మార్గదర్శకత్వంలోనే సాహిత్య నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. అలా తండ్రి అడుగుజాడల్లోనే నేడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇంతటి గొప్ప సాహిత్యకారుడు 2021లో మనందరినీ వెళ్లడం బాధాకరమనే చెప్పాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×