E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  డాక్టర్ తో గొడవ పడ్డ కావ్య

Brahmamudi Serial Today January 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  డాక్టర్ తో గొడవ పడ్డ కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:

డాక్టర్‌ చక్రవర్తి హాస్పిటల్‌కు రాడని తెలియడంతో కావ్య వాళ్ల పాప ఫైల్‌ డాక్టర్‌ అనురాధ చూస్తుంది. ఫైల్స్‌ చూసి షాక్‌ అయిన అనురాధ వెంటనే విషయం రాజ్‌, కావ్యలకు చెప్తుంది. డాక్టర్‌ మాటలకు రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు. ఇంతలో రాజ్‌ ఎంత ఖర్చైనా ఆపరేషన్‌ చేయండి మేడం అంటాడు. దీంతో డాక్టర్‌ అనురాధ ప్రాబ్లమ్ డబ్బు గురించి కాదండి.. .. 10 రోజుల పాపకు ఆపరేషన్ చేస్తే బతుకుతుందా? లేదా? అన్నదే సమస్య.. సర్జరీ చేస్తే పాప ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం.. కానీ మీరు ఒక నిర్ణయానికి వచ్చి ధైర్యంగా స్టెప్ తీసుకుంటే మా ప్రయత్నం మేము చేస్తాము అంటూ అనురాధ చెప్పగానే.. కావ్య కోపంతో రగిలిపోతుంది.

ఈ పాపని మీరే ఉంచుకోండి.. నా కన్నబిడ్డను తిరిగి నాకు ఇవ్వండి అంటూ గట్టిగా అరుస్తుంది. కావ్య మాటలకు డాక్టర్‌, రాజ్‌ షాక్‌ అవుతారు. మళ్లీ కావ్య కోపంగానే.. ఎవరి బిడ్డకో మీరు చెప్పిన వ్యాధి ఉంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా లేదు, అదే సమయంలో నా పాప పుట్టింది ఆరోగ్యంగా ఉంది కాబట్టే ఆరోగ్యంగా లేని ఆ బిడ్డను నాకు ఇచ్చి, నా బిడ్డను వాళ్లకి ఇచ్చేశారు. అందరూ ఒక్కటై మా మీద కుట్ర చేశారు, తల్లిని బిడ్డను వేరు చేశారు.. మర్యాదగా నా బిడ్డను నాకు ఇవ్వండి అంటూ గొడవ చేస్తుంది కావ్య. దీంతో డాక్టర్‌ కూడా కోపంగా రియాక్ట్‌ అవుతుంది. మీ ఆవిడ ఇక మారదా? మళ్లీ మళ్లీ ఇదే చెబుతుంది.. అసలు ఏం మాట్లాడుతున్నారు కావ్య గారు మీరు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది డాక్టర్‌. అంతా చాటు నుంచి నర్స్‌ నీలవేణి గమనిస్తుంటుంది.

Advertisement

మరోవైపు కావ్య, రాజ్‌ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటి దగ్గర ఎదురుచూస్తుంది. అందరూ హాల్లో కూర్చుని కంగారు పడుతుంటారు. ఇంతలో రాజ్‌ కావ్య వస్తారు. వాళ్లను చూసిన అపర్ణ ఎదురుగా వెళ్లి పాపకు ఏమైంది..? ఎందుకిలా జరిగింది..? డాక్టర్లు ఏం చెప్పారు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ కోపంగా పాప విషయం తర్వాత అమ్మా ఇది ఈ కళావతి హాస్పిటల్‌ లో చేసిన పనికి తలెత్తుకోలేకపోయాను.. అని చెప్పగానే.. ఇంద్రాదేవి వచ్చి ఇంతకీ ఏం జరిగింది కావ్య.. ఎందుకు పాప గురించి చెప్పకుండా రాజ్‌ నిన్ను తిడుతున్నాడు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ కోపంగా డాక్టర్‌ పాప కండీషన్ గురించి చెబుతుంటే.. డాక్టర్‌తోనే గొడవ పడుతుంది ఈ కళావతి అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. పాప పరిస్ధితి అస్సలు బాగాలేదని, గుండెల్లో ప్రాబ్లమ్ ఉందని. పాపకి వెంటనే ఆపరేషన్ చేయాలని.. ఒకవేళ ధైర్యం చేసి ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు అని రాజ్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

అదంతా డాక్టర్ చెప్తుంటే.. ఈ కళావతి.. ఆ డాక్టర్ మీద విరుచుకుపడింది. ఇదంతా డాక్టర్ల కుట్ర అని.. ఆరోగ్యంగా ఉన్న తన బిడ్డను మార్చి, అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఇచ్చారని .. తన బిడ్డను తిరిగి ఇచ్చేయమంటూ చాలా పెద్ద రాద్ధాంతం చేసింది.. అసలు నా బిడ్డను ఎలా కాపాడాలని ఆలోచించాలా? కళావతి మనసు ఎలా మార్చాలో ఆలోచించాలా? ఏం చేయను అంటూ రాజ్ ఎమోషనల్‌ అవుతుంటాడు. దీంతో కావ్య చాలా కూల్‌ గా మీరు నన్ను అర్ధం చేసుకుంటే దారి దొరుకుతుంది. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది.. ఎవరికో డాక్టర్ సహకరించారు. అందుకే బిడ్డలను మార్చేశారు అని చెప్తుంది. దీంతో రాజ్‌ మరింత కోపంగా ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అనడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా..? అని అడుగుతాడు రాజ్. నా దగ్గర ఇప్పుడు సాక్ష్యం లేకపోవచ్చు… కానీ నా బిడ్డ ఎక్కడుందో నేనే కనుక్కుంటానని చెప్తుంది కావ్య… దీంతో సుభాష్‌  ఓ వైపు పాపకు అంత ప్రమాదకరమైన జబ్బు అంటున్నారు.. లేని పాప కోసం ఎందుకంత తాపత్రయ పడతావు కావ్య అనగానే.. ఈ పాపకు ఏం కానివ్వను, నా బిడ్డను జాగ్రత్తగా తెచ్చుకుని.. ఈ బిడ్డను ఆ తల్లిదండ్రులకు ఆరోగ్యంగా అప్పగిస్తానని కావ్య చెప్తుంది.

Advertisement

తర్వాత అంతా గమనించిన రాహుల్‌, రేఖ హ్యాపీగా రుద్రాణికి ఫోన్‌ చేసి నీ ప్లాన్‌ వర్కవుట్‌ అయిందని త్వరలోనే తాను రాజ్‌కు దగ్గర అవుతానని చెప్తుంది. దీంతో రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. రాహుల్‌, రేఖ నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా వేయాలో చెప్తుంది. మరోవైపు ధర్మేంద్ర పాప  జాతకం తెలుసుకోవడానికి జ్యోతిష్యుడిని పిలుస్తాడు. ఆయన పాపకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి పూజలు చేయాలి అని చెప్తాడు. దీంతో తులసి కంగారు పడుతుంది. మరోవైపు కావ్య తన దగ్గర ఉన్న పాపను అప్పుకు ఇచ్చి బయటకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పు అడగ్గానే.. నా బిడ్డ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×