E-Paper
Advertisement

BMW Pre Release: ఇది మీరు పెట్టిన బిక్షే..డైరెక్టర్ బాబీ ఎమోషనల్ కామెంట్స్!

BMW Pre Release: ఇది మీరు పెట్టిన బిక్షే..డైరెక్టర్ బాబీ ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

BMW Pre Release: రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Wignyapthi) సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకులకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ నేపథ్యంలోనే దర్శకుడు బాబి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబి రవితేజ గురించి కాస్త ఎమోషనల్ అయ్యారు . ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ గారు ఎంతోమందికి స్ఫూర్తి అని తెలిపారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం మీరు పెట్టిన బిక్షే అన్నయ్య అంటూ ఎమోషనల్ అయ్యారు.

రవితేజ వల్లే ఈ స్థాయి..

రవితేజ తనకు అవకాశం ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. అలాగే రవితేజ సినిమాల గురించి కొంతమంది చేసే విమర్శల పై కూడా బాబి సీరియస్ అయ్యారు. రవితేజ గారు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారంటే చాలా కోపం వస్తుందని, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసేది ఆయనే అంటూ బాబి తెలిపారు. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు .ఇక నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ సినిమా చూసి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటూ రివ్యూ ఇచ్చారని, ఆయన రివ్యూ ఇచ్చారంటే సినిమా సూపర్ హిట్ అంటూ ఈ సందర్భంగా బాబి తెలియజేశారు. ఇక రవితేజ బాబి కాంబినేషన్ లో ‘ పవర్ ‘ అనే సినిమా ప్రేక్షకులందరికీ వచ్చింది.

బాబి డైరెక్షన్ లో రవితేజ?

Advertisement

ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కాంబినేషన్లు ఇప్పటివరకు సినిమా రాలేదు కానీ త్వరలోనే ఓ సినిమా వస్తుందని బాబి తెలియజేశారు. ఇక బాబీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటుందని అందరూ భావించారు కానీ మెగా 158 సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్..

Advertisement

ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో హీరోయిన్లుగా ఆశికా రంగనాథ్, డింపుల్ హైయతి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. గత కొద్ది రోజులుగా రవితేజ నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ అభిమానులు ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది . జనవరి 13వ తేదీ ఈ సినిమా భారీ అంచనాలు నడుమ ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

Also Read: Anil Ravipudi: ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేను ..  భగవంత్ కేసరి పై అనిల్ కామెంట్స్!

Related News

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!

Big Stories

Advertisement
×