E-Paper
Advertisement

CM Revanth Reddy: నీటి వివాదాలకు సీఎం చెక్.. యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం స్పెషల్ ఫోకస్

CM Revanth Reddy: నీటి వివాదాలకు సీఎం చెక్.. యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం స్పెషల్ ఫోకస్

CM Revanth Reddy:  జల వివాదాల విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. తెలంగాణకి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే.. తాను నీళ్లే కావాలని కోరుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని.. ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇక.. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ని ప్రదర్శించనున్నారు.
జాతీయ విద్యా విధానం తరహాలోనే.. తెలంగాణలోనూ ప్రత్యేక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జనవరి 10 దావోస్ ప్రిపరేషన్స్

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంవోయూలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ని సందర్శించిన సమయంలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలు, కమిట్మెంట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో కుదిరిన ఎంవోయూలపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో.. దావోస్‌లో ఈ నెలలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ని ప్రదర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ప్రతిపాదించిన క్యూర్, ప్యూర్, రేర్ ఫ్రేమ్‌వర్క్‌ని.. ప్రభుత్వం దూకుడుగా ప్రోత్సహిస్తుందనే విషయాన్ని అంతర్జాతీయ కంపెనీల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు.. తెలంగాణ రైజింగ్ టీమ్ రాష్ట్రానికి ఉన్న బలాలు, సామర్థ్యంపై ఆధారపడి.. త్రిముఖ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్‌తో.. జనవరి 19 నుంచి 23 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశం జరగనుంది. దాంతో.. మునుపటి పెట్టుబడి కమిట్మెంట్లని రివ్యూ చేసి, అందుకనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం.
ఏవైనా పెండింగ్ సమస్యలు, అడ్డంకులు ఉంటే వాటిని పరిష్కరించాలని నొక్కి చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో వివరించినట్లుగా.. రాష్ట్ర పరివర్తన ప్రణాళికలు, ఆర్థిక వృద్ధికి రోడ్‌మ్యాప్‌ని ముందుకు తీసుకురావడంపై.. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దృష్టి పెట్టనుంది.

జనవరి 9 నీళ్లపై పంచాయితీలొద్దు!

తెలంగాణకి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే.. నీళ్లే కావాలని కోరుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని బదులిస్తానని తెలిపారు. వివాదాలు పరిష్కారమైతే.. ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని.. వాటికి నీరు, కరెంట్ అవసరమని చెప్పారు. నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలన్నారు. నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదన్నారు. కోర్టుల ముందుకో, మరెవరి దగ్గరో పంచాయితీ పెట్టుకునే కన్నా.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని.. ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలని.. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అంతా సహకరించాలని.. ఏపీ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించొద్దని.. ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి.. జల వివాదాలపై..

ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరాల వల్ల పర్యావరణం, CWC నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని.. దాంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని చెప్పారు సీఎం. రాజకీయ ప్రయోజనాలకన్నా.. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని అన్నారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, దానిని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని అన్నారు.

జనవరి 8 బాలికలు ఫస్ట్

రాష్ట్రంలో మొద‌టి విడ‌త‌లో పూర్తయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో ఎక్కువగా బాలికలకే కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో.. బాలురు, బాలిక‌ల‌కు ప్రత్యేకంగా నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు. విద్యాశాఖకు సంబంధించి.. ఈ వారం సీఎం హైలెవెల్ రివ్యూ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సహా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సిలబస్‌లో మార్పులపై సమీక్షించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో.. సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు. అదేవిధంగా.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్రణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశించారు. కిచెన్ ఏర్పాటుకు రెండెకరాల స్థలం గానీ, 99 ఏళ్లకు లీజు తీసుకునే అంశంపై క‌లెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల‌ని సీఎస్‌కు సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాల నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్సరం నాటికి అందుబాటులోకి రావాలన్నారు సీఎం. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాలన్నారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో కొత్త కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున.. త్వర‌గా అమ‌ల‌య్యేలా చూడాలన్నారు.

జనవరి 8 ప్రత్యేక విద్యా విధానం

ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా.. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు.. ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వారం.. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలో వచ్చిన ప్రత్యేక బృందం.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ క్రమంలో విద్యా రంగం పట్ల తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. జాతీయ విద్యా విధానం తరహాలోనే.. తెలంగాణలోనూ ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం.. ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తెస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా.. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యా రంగంలో సమూల మార్పుల్లో భాగంగా చేపడుతున్న సంస్కరణలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కూడా వివరించారు. ఈ ప్రాజెక్ట్‌పై హిమాచల్ బృందం ఆసక్తి చూపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌ని.. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ అభినందించారు.

గోదావరి నదిపై ఏపీ తలపెట్టిన.. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు.. సీనియర్ న్యాయవాదులకు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు.. రాష్ట్రంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్ వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు.. అసెంబ్లీలో సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇదే నెలలో ప్రారంభంకానున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం మహాజాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

జనవరి 7 సీఎం కప్‌కి రెడీ

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి.. చీఫ్ మినిస్టర్స్ కప్ సెకండ్ ఎడిషన్ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఆటల పోటీలపై అవగాహన కల్పించేందుకు.. 17వ తేదీ వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది. 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31వ తేదీ వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు.. నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి. గత డిసెంబర్‌లోనే జరగాల్సిన ఈ క్రీడలు.. వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో.. మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ పోటీలను నిర్వహించనుంది.

జనవరి 6 కొత్త జిల్లాలు!

తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు.. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించనున్నారు. మండలాలను, జిల్లాలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడంతో.. పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాలను.. నాలుగు వేర్వేరు జిల్లాల్లో చేర్చడం వల్ల గందరగోళం, అసౌకర్యం తలెత్తుతోంది. త్వరలోనే.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే క్యాబినెట్‌లో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే.. రాష్ట్రంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఆవశ్యకతను గుర్తించింది.

జనవరి 5 మేడారం పిలుస్తోంది

ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆహ్వానించారు. మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. మేడారం ఆలయ పూజారులతో కలిసి.. అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎంని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇదే సమయంలో.. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. హనుమకొండ జిల్లాలో
ఈ నెల 13 నుంచి జరగనున్న.. ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు ఆహ్వానించారు. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులు కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.

జనవరి 4 మన నీళ్లు మనకే

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన.. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు.. ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్లకు గానీ నల్లమలసాగర్‌కు గానీ లింక్ చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ.. ఈ పనులు ఆపేలా ఆదేశించాలని సుప్రీంకోర్టుని కోరింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర జలసంఘం, జల్ శక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు.. పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.

Story by: Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×