E-Paper
Advertisement

Varanasi : వారణాసి సినిమా మీ ఊహకు కూడా అందదు, దేవకట్ట కామెంట్స్

Varanasi : వారణాసి సినిమా మీ ఊహకు కూడా అందదు, దేవకట్ట కామెంట్స్
Advertisement

Varanasi : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం సీరియల్ తో దర్శకుడుగా మారిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అక్కడ నుంచి రాజమౌళి ప్రయాణం ఇప్పటివరకు కూడా చాలా విజయవంతంగా కొనసాగింది.

ఒక్కో మెట్టు ఎక్కుతూ తాను సక్సెస్ అవడం మాత్రమే కాకుండా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని కూడా అమాంతం పెంచేశారు. బాహుబలి లాంటి ఒక సినిమాను ఊహించడమే కష్టం అనుకుంటే, ఆ సినిమాను ఊహించి దానిని వెండితెర మీద ఆవిష్కరించే వరకు రాజమౌళి ప్రయాణం వర్ణనాతీతం. నేడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. దానికి ఏకైక కారణం ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి.

వారణాసి ఊహకు అందదు

Advertisement

ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మరింత మారిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత మరియు దర్శకుడు దేవకట్ట విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు. ఈ సినిమా అసలు ఎవరి ఊహకు కూడా అందదు అని చెప్పారు. తాను ఈ సినిమాకి సంబంధించి కథను విన్నప్పుడే మైండ్ బ్లాక్ అయిపోయిందట.

మరోవైపు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సినిమా ఒక అడ్వెంచర్ సినిమాగా ఉంటుంది అని నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కానీ ఈ ట్రైలర్ చూసిన తరువాత మరింత షాక్ కి గురి అయిపోయాను. త్రేతా యుగం, కలియుగం వంటి విషయాలన్నీ చూస్తే నా మైండ్ పోయింది అంటూ రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సినిమాకి భారీ ఎలివేషన్ ఇచ్చాడు.

బాహుబలి మాదిరిగా

Advertisement

ఇక దేవకట్ట విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకు రైటింగ్ లో హెల్ప్ చేశారు. అయితే ఈ సినిమాకి కూడా దేవకట్ట అదే స్థాయిలో పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం షూట్ గ్యాప్ తీసుకున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ నెలలో విడుదల కానున్నట్లు ఎం ఎం కీరవాణి చెప్పారు.

కానీ చెప్పిన డేట్ కి సినిమా వస్తుందా? అనేది డౌట్. ఏదేమైనా ఈ వారణాసి వరల్డ్ చూసిన తర్వాత చాలామంది ఆడియన్స్ కి మతి పోయింది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో అని ఊహకి కూడా అందడం లేదు. 2027 శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Rajinikanth : తలైవర్ 173 కోసం డిఫరెంట్ లుక్, చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ అలా

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×