E-Paper
Advertisement

Yadadri News: ఇది కదా కావాల్సింది.. డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోం.. ఓటర్ల ప్రతిజ్ఞ

Yadadri News: ఇది కదా కావాల్సింది.. డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోం.. ఓటర్ల ప్రతిజ్ఞ
Advertisement

Yadadri News: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా.. గ్రామాభివృద్ధి కోసం నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకునే దిశగా ఓటర్లను చైతన్యపరచడం ఈ కార్యక్రమాల లక్ష్యం…

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల్లో శుక్రవారం ఉదయం ఓటు హక్కుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో.. జిల్లా కలెక్టర్ బొమ్మల రామారం మండల కేంద్రంలో మహిళా ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటు శక్తి దేశ ప్రగతికి, గ్రామాభివృద్ధికి ఎంత ముఖ్యమో వివరించారు. ఒక్కరోజు నాయకులు ఇచ్చే డబ్బుకు కాక, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

అవగాహన సదస్సు ముగింపులో.. కలెక్టర్ మహిళా ఓటర్లందరితో ప్రతిజ్ఞ చేయించారు. ‘మా ఓటును గ్రామాభివృద్ధికి మాత్రమే వినియోగిస్తాం. డబ్బుకు, మద్యానికి మా ఓటును అమ్ముకోం. స్వచ్ఛందంగా.. నీతి నిజాయితీతో గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు మా ఓటును ఉపయోగిస్తాం’ అని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లలో నూతన ఉత్తేజాన్ని, నిబద్ధతను కలిగించింది.

కలెక్టర్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం జలాలపూర్ గ్రామ ఓటర్లలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. బొమ్మల రామారం మండలం పరిధిలోని జలాలపూర్ గ్రామానికి చెందిన కొందరు ఓటర్లు తమ ఇళ్ల ముందు బోర్డులను ఏర్పాటు చేశారు. ‘మా ఓటును డబ్బులు, గిఫ్ట్‌లకు అమ్ముకోము. మా ఓటు గ్రామాభివృద్ధికి. ఒక్కరోజు నాయకులు ఇచ్చే డబ్బుకు కాదు’ అని స్పష్టంగా బోర్డులపై రాశారు.

Advertisement

నీతి నిజాయితీతో స్వచ్ఛందంగా ఓటు వేస్తామని కూడా ప్రకటించారు. ఓటును అమ్ముకోబోమని ఓటర్లు తమ ఇళ్ల ముందు బోర్డులు పెట్టి తమ నిబద్ధతను చాటుకోవడం జిల్లా ఎన్నికల అధికారులను, కలెక్టర్‌ను సంతోషపరిచింది. ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక శుభపరిణామంగా అధికారులు అభివర్ణించారు. ఈ చర్య ఇతర గ్రామాల ఓటర్లకు ఆదర్శంగా నిలిచి, మరింత మందిని చైతన్యపరుస్తుందని కలెక్టర్ హనుమంత రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×