Actress Soundary: సౌందర్య పరిచయం అవసరం లేని పేరు. పేరుకే కన్నడ నటి అయినప్పటికీ ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికే ప్రేక్షకుల మధ్యలో సజీవంగానే ఉన్నారు. సౌందర్య అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలో చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. సౌందర్య తన నటన కట్టుబొట్టుతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. హీరోయిన్గా ఇండస్ట్రీలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సౌందర్య అకాల మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఇక సౌందర్య మరణించినప్పటికీ నిత్యం సౌందర్యకు సంబంధించి ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ దేవి ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సౌందర్య గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. సౌందర్యను ఒక పెళ్లి వేడుకలు చూసి హీరోయిన్గా ఈ అమ్మాయి అయితే బాగుంటుందనిపించింది. అలా పెళ్లిలో చూసి తనని హీరోయిన్ గా ఎంపిక చేసామని తెలిపారు. ఇక సౌందర్య గురించి కూడా ఈయన మాట్లాడుతూ సౌందర్య అప్పట్లోనే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మాదిరిగానే అందరితో ఉండేదని తెలిపారు.
చిలకపచ్చ కాపురం అనే సినిమా షూటింగ్ సమయంలో హోలీకి సంబంధించిన సీన్స్ షూటింగ్ చేశాము. ఆ తర్వాత కొన్ని సీన్లో షూటింగ్ చేయాలి కానీ రంగులు పడటంతో ఆమె స్నానం చేయాల్సిఉంది. అప్పట్లో కేరవాన్లు ఉండేది కాదు ఒక చిన్న పల్లెటూరులో ఒక రేకు అడ్డుపెట్టిన బాత్రూం ఉన్న ఇంటిని చూపిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సౌందర్య స్నానం చేసి వచ్చిందని దేవి ప్రసాద్ తెలియచేశారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేది కాదని పక్కనే ఒక చిన్న ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఆమె ఉండేదని తెలిపారు.
రాజకీయాలలోకి వెళ్లకపోయి ఉంటే బాగుండేది..
సౌందర్య తండ్రి చనిపోతే మేమందరం ఆయనని చూడటానికి బెంగళూరు వెళ్ళాము. తన తండ్రిని చూడటానికి వారి బంధువులందరూ వస్తుంటే సౌందర్య వారి వద్దకు వెళ్లి రండి మామయ్య బాబాయ్ పిన్ని అంటూ మాట్లాడిస్తున్నారు ఇలా ఒక స్టార్ హీరోయిన్గా ఎంతోమంది నౌకర్లు అందరూ ఉన్నప్పటికీ ఈమె స్వయంగా వెళ్లి వారిని పలకరించడం చూసి షాక్ అయ్యానని దేవి ప్రసాద్ తెలిపారు. ఆమె పేరుకే స్టార్ హీరోయిన్ కానీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని తెలిపారు. ఇక సౌందర్య మరణం గురించి ప్రస్తావనకు రావడంతో ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు చాలా గొప్ప జీవితాన్ని గడుపుతారు కానీ రాజకీయాలలోకి వచ్చి చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకున్నారని తెలిపారు. సౌందర్య కూడా రాజకీయాలలోకి వెళ్లకపోయి ఉంటే బ్రతికేదని, ఆమె మరణ వార్త వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాను అంటూ దేవి ప్రసాద్ సౌందర్య మరణం గురించి ఆమె వ్యక్తిత్వం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Love Story Re Release: లవర్స్ డే రోజు… కల్ట్ క్లాసిక్ ‘లవ్ స్టోరీ’ రీ రిలీజ్