Puri Jagannath:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పూరీ .. మహేష్ బాబు (Mahesh Babu) ‘పోకిరి’ సినిమాతో తన మాస్ మార్క్ చూపించి స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉండే ఎంతోమంది హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా వారి కెరియర్లో మైలురాయి లాంటి సినిమాలు తీసి మంచి పేరు సొంతం చేసుకున్నారు.
అలాంటి పూరీ జగన్నాథ్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చివరిగా లైగర్ సినిమాతో పూర్తి డిజాస్టర్ ను చవిచూచిన ఈయన.. ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు అత్యంత ఆప్తుడైన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రఘు కుంచె పూరీ జగన్నాథ్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పవిత్ర!
టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ రఘు కుంచె కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి . ముఖ్యంగా ఇడియట్, దేశముదురు, నేనింతే వంటి హిట్ చిత్రాలకు వీళ్ళిద్దరూ కలిసి పని చేశారు కూడా.. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. పరిశ్రమలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ.. ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదనేదే పూరీ జగన్నాథ్ సిద్ధాంతమని రఘు కుంచె తెలిపారు. ప్రొఫెషనల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించే హక్కు నాకుంది అంటూ ఆయన వివరించారు. అయితే పూరీ జగన్నాథ్ మోసపోవడంపై రఘు కుంచె చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
రఘు కుంచే మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ అతిపెద్ద బలహీనత మనుషులను గుడ్డిగా నమ్మడం.. కొందరిని అతిగా నమ్మి వారిపై ఆధారపడడం వల్ల తీవ్రంగా నష్టపోయాడు. అసలు విషయం తెలుసుకున్న నేను.. నువ్వు తప్పు చేస్తున్నావ్.. జాగ్రత్త పడు అని చెప్పేసరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. ముఖ్యంగా ఏక్ నిరంజన్ , బంపర్ ఆఫర్ సినిమాలా సమయంలో పూరీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఆ సమయంలో నెలకు రూ.50 లక్షల వరకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లే దారిలో ఒక అందమైన ఆఫీస్ ని కూడా నిర్మించుకున్నాడు. అప్పుల బాధలు, వడ్డీలు కట్టలేక ఇష్టపడి కట్టుకున్న ఆఫీస్ ను కూడా అమ్మేసి అప్పులు తీర్చేశాడు. ఆ తర్వాత అద్దె ఆఫీస్ తీసుకొని మళ్ళీ ఒక్కో మెట్టు ఎదుగుతూ తిరిగి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు” అంటూ పూరీ జగన్నాథ్ ఆర్థిక పరిస్థితులపై స్పందించారు రఘు కుంచె.