E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్..  Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!
Advertisement

Vi Plan: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికి డేటా తప్పనిసరిగా మారిపోయింది. దీంతో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) విభిన్నమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెస్తోంది. అందులోనూ తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే వారి కోసం రూ.479 ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎక్కువ మంది వీఐ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో చూద్దాం.

అపరిమిత వాయిస్ కాల్స్..

వీఐ తీసుకొచ్చిన రూ.479 ప్లాన్ తో యూజర్లకు అపరిమితమైన ఫ్రీ కాల్స్ లభించనున్నాయి. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా పరిమితి లేకుండా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. లోకల్, ఎస్టీడీ (STD), రోమింగ్ కాల్స్ పూర్తిగా ఫ్రీ. దీంతో పాటు రోజువారీ అవసరాల కోసం ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు (SMS) లభిస్తాయి.

డేటా, వ్యాలిడిటీ పరిమితి

Advertisement

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 48 రోజుల కాలపరిమితి (Validity) లభించనుంది. దీనిలో ప్రతిరోజూ 1 GB హై-స్పీడ్ డేటా పొందొచ్చు. అర్హులైన వీఐ యూజర్లకు అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ ఉచితంగా అపరిమిత డేటా లభించనుంది. నెల రోజులకు పైగా వ్యాలిడిటీతో డేటా, కాలింగ్ కాంబినేషన్ కోరుకునే వారికి ఇది సరైన ప్లాన్ అని చెప్పవచ్చు.

వీఐ టీవీ కంటెంట్ ఫ్రీ

ఈ ప్లాన్ లో డేటా, కాల్స్ మాత్రమే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ లవర్స్ కోసం.. మరొక సాలిడ్ బెనిఫిట్ ను వీఐ అందిస్తోంది. రూ.479 ప్లాన్ తో ‘Vi Movies & TV ‘యాప్ ద్వారా ఫ్రీగా సినిమాలు, లైవ్ న్యూస్, టీవీ షోలను వీక్షించవచ్చు.

Advertisement

Also Read: వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

తక్కువ ధరకు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. అలాగే సెకండరీ సిమ్ కోసం సాధారణ ఇంటర్నెట్ అవసరాలు, నాన్ స్టాప్ వాయిస్ కాలింగ్ కోరుకునే వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

Also Read: నేషనల్ మీడియా ఇంట్రాక్ట్‌లో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×