E-Paper
Advertisement

పదేళ్ల క్రితమే ఆ కథలు రాసేశారా? బాక్సాఫీస్ హిట్స్ వెనుక డైరెక్టర్ జయశంకర్ ‘మాస్టర్ మైండ్’!

పదేళ్ల క్రితమే ఆ కథలు రాసేశారా? బాక్సాఫీస్ హిట్స్ వెనుక డైరెక్టర్ జయశంకర్ ‘మాస్టర్ మైండ్’!

Jayashankar Director: రెండు కామెడీ సీన్లు , మూడు ఫైట్లు, నాలుగు పాటలు ..ఇదీ ఒకప్పుడు తెలుగు సినిమాని ఊపేసిన కమర్షియల్ ఫార్ములా.కానీ కాలం మారింది.కరోనా పుణ్యమా అని వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేయడంతో వి వాంట్ కొత్తదనం అంటూ సరికొత్త కంటెంట్ ని డిమాండ్ చేయడం మొదలెట్టారు ఆడియన్స్. ఇక కంటెంట్  ఏ  మాత్రం క్లిక్ అయినా కాసులు కురిపిస్తామంటూ చాలా సార్లు ప్రూవ్ చేశారు కూడా. అయితే ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి బయటపడింది.యస్ ..  ప్రస్తుతం మనం చూస్తున్న సెన్సేషనల్ హిట్స్,డిఫరెంట్ స్టోరీస్  వెనుక ఒక ‘సైలెంట్ మాస్టర్ మైండ్’ ఆలోచనలు ఉన్నాయన్న చేదు నిజం వినిపిస్తోంది.ఆ మాస్టర్ మైండ్ మరెవరో కాదు, దర్శకుడు జయశంకర్.ఆయన ఎప్పుడో పదేళ్ళ కిందట క్రేజీ కాన్సెప్ట్ లతో చేసిన  షార్ట్స్ ఫిలిమ్స్ ఇపుడు రూపం మార్చుకొని కోట్లు కొల్లగోడుతున్నాయ్.

సినిమాలోని ఆత్మ, దాని స్క్రీన్ ప్లే  సోల్ ఒక్కటే

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జయశంకర్ 2015లో రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy).ఇందులో దేవుడికి, మనిషికి మధ్య ఉండే ఆ అన్యోన్యమైన, లోతైన బంధాన్ని.. ఒక మనిషి చేసే కర్మలను దేవుడు ఎలా గమనిస్తాడు అనే ఫిలాసఫీని పదేళ్ల క్రితమే క్రియేటివ్ గా చెప్పాడు జయశంకర్.ఇక అక్టోబర్ 31, 2024న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన కిరణ్ అబ్బవరం చిత్రం ‘క’ (KA)  కూడా కాస్త అటు ఇటుగా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కడం విశేషం. మీరు గనుక ఆ రెండు ఫిలిమ్స్ చూస్తే సినిమాలోని ఆత్మ, దాని స్క్రీన్ ప్లే  సోల్ ఒక్కటే అని ఈజీగా గుర్తుపట్టేస్తారు కూడా. దీన్ని బట్టి  జయశంకర్ విజనరీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

”విటమిన్ షీ’ (Vitamin She) కాన్సెప్ట్ ని పోలి ఉన్న ‘LIK’ 

ఇక  ‘క’ సినిమా మాత్రమే కాదండోయ్  జూనియర్ ధనుష్  ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న ‘LIK’ (Love Insurance Kompany) మూవీ ట్రైలర్ చూసినా జయశంకర్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. జయశంకర్ సెప్టెంబర్ 18, 2020న డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్  చేసిన ‘విటమిన్ షీ’ (Vitamin She) చిత్రానికి,ఈ లేటెస్ట్ మూవీకి పోలికలు చాలా దగ్గరగా ఉండటంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు.

also read:హీరో లేడు.. ఐటెం సాంగ్స్ లేవు.. కేవలం ఆమె నటనతోనే 200 కోట్లు! ఆ ‘వేశ్య’ కథకు ఏకంగా 49 అవార్డులు..

 నోమోఫోబియా అంటే మొబైల్ ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోయే యువత మనస్తత్వాన్ని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాయిస్ అసిస్టెంట్ మనిషి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి పరిస్థితులను ఎలా తలకిందులు చేస్తుంది అనే పాయింట్‌ను జయశంకర్ నాలుగేళ్ల క్రితమే  సినిమాగా  తీసి ‘ట్రెండ్ సెట్టర్’ అనిపించుకున్నారు.నేడు ప్రపంచమంతా ఏఐ (AI) గురించి మాట్లాడుకుంటోంది కానీ, ఆ టెక్నాలజీ వల్ల కలిగే సామాజిక ఇబ్బందులను జయశంకర్ అప్పుడే సినిమాగా మలవడం మెచ్చుకోతగ్గ విషయమే.ఇక ఇపుడు ఇదే పాయింట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో డిబెటబుల్ అవడం విశేషం.

దర్శకుడు కూడా టచ్ చేయని ఈ సున్నితమైన పాయింట్స్ 

ఇక ఆయన కెరీర్‌లో అత్యంత ప్రెస్టేజియస్  ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా ‘అరి’ (Ari: My Name is Nobody). మే 14, 2023న రిలీజ్ అయిన  ఈ సినిమా భారతీయ సినీ హిస్టరీలోనే ఒక రేర్ అటెంప్ట్. ‘అరిషడ్వర్గాలు’ (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) అనే లోతైన ఆధ్యాత్మిక మరియు మానసిక అంశాలను కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడం అంటే మాములు విషయం కాదు. ఇండియాలో ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా టచ్ చేయని ఈ సున్నితమైన పాయింట్‌ను జయశంకర్ తెరకెక్కించాడంటే అతని గట్స్ ని మెచ్చుకొని తీరాల్సిందే. అయితే సినిమా కాస్త  టాక్ తెచ్చుకుంటుంది అన్న టైమ్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ‘సినిమా తీయడం అంటే ఏంటో తెలియని వాళ్లు రివ్యూలు ఎలా ఇస్తారు? అంటూ చేసిన  కామెంట్స్ సినిమాపై  నెగెటివ్ ఇంపాక్ట్ చూపింది. ఆ కాంట్రవర్సీ  కారణంగా ఇంత గొప్ప కంటెంట్ ఉన్న సినిమా చాలామంది ప్రేక్షకులకు తెలియకుండానే వెళ్ళిపోవడం బాధాకరం. సరైన గుర్తింపు లభించి ఉంటే ‘అరి’ ఒక క్లాసిక్ గా నిలిచేదే.ముందు ముందు అరి సినిమా  కాన్సెప్ట్ నే అటు ఇటుగా చేసి పెద్ద సినిమాగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.మొత్తానికి ఆయన తీసిన సినిమాలు, ఆయన రాసుకున్న కాన్సెప్ట్స్ మరెన్నో సినిమాలకు మూలస్తంభాలుగా మారుతున్నాయన్న మాట. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ ని గుర్తించి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు ఏమైనా ఛాన్సులు ఇస్తాయేమో చూడాలి!

also read:టాలీవుడ్ ‘డేట్స్’ గేమ్.. మేకర్స్ సైలెంట్.. చిన్న సినిమాలు వయొలెంట్! చరణ్, నాని ఎందుకిలా చేస్తున్నారు?

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×