E-Paper
Advertisement

బేబమ్మ బ్రేకప్ స్టోరీ..ఇంతకీ ఆ హీరో ఎవరో ?అసలు విషయం చెప్పేసిన కృతి శెట్టి!

బేబమ్మ బ్రేకప్ స్టోరీ..ఇంతకీ ఆ హీరో ఎవరో ?అసలు విషయం చెప్పేసిన కృతి శెట్టి!
Advertisement

Krithi Shetty: ఉప్పెనతో దూసుకొచ్చిన టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయిపొయింది.ఎప్పుడూ  సిల్వర్ స్క్రీన్ పై పద్ధతిగా కనిపిస్తూ యూత్ గుండెల్ని పిండేసే ఈ అమ్మడు తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబందించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ షేర్  చేసుకోవడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా తన ప్రేమ, బ్రేకప్ గురించి ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.

మనసులోని మాటలను బయట పెట్టేసిన బేబమ్మ 

Advertisement

త్వరలో విడుదల కానున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి తన మనసులోని మాటలను ఇదిగో ఇలా బయట పెట్టేసింది.తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇస్తునే గతంలో తన జీవితంలో ఒక బ్రేకప్ ఉందన్న చేదు నిజాన్ని ధైర్యంగా ఒప్పేసుకుంది.ఇక  ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని, ఆమెతో తాను ప్రతి విషయం పంచుకుంటానని చెప్పడం ఇక్కడ విశేషం.దీంతో “అంత అందమైన అమ్మాయికి బ్రేకప్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరు?” అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారట నెటిజన్లు .

also read:టాలీవుడ్ ‘డేట్స్’ గేమ్.. మేకర్స్ సైలెంట్.. చిన్న సినిమాలు వయొలెంట్! చరణ్, నాని ఎందుకిలా చేస్తున్నారు?

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే  ఇష్టం 

ఇక కేవలంపర్సనల్ లైఫ్ కి సంబందించిన  టాపిక్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎదురయ్యే నెగెటివిటీపై కూడా కృతి చాలా ఘాటుగానే స్పందించింది. తనపై వచ్చే ట్రోల్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఎవరైనా హద్దు దాటి అసభ్యంగా ప్రవర్తిస్తే అస్సల్ ఊరుకోనంటూ కుండబద్ధలు కొట్టింది ఈ కన్నడ కస్తూరి. అలాంటి వారిని వెంటనే సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని, తనకు ప్రశాంతత ముఖ్యమని క్లారిటీ ఇచ్చేసింది.ఇక  టాలీవుడ్ హీరోలలో తనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టమని,ఆయనే తన ఫేవరెట్ హీరో అని కృతి చెప్పడంతో ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు మెగా ఫ్యాన్స్.ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి కూడా.

ఏప్రిల్ 10న తెలుగు రాష్టాలపై ఎటాక్ చేసేందుకు రెడీ

ఇక కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రంపై  అంచనాలు భారీగానే ఉన్నాయ్.‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియాలో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటిస్తుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇక  లేడీ సూపర్ స్టార్ నయనతార స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో  ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్‌ను పెంచిందనే చెప్పాలి. ఇకపొతే ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా  యూత్‌ను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 10న తెలుగు రాష్టాలపై ఎటాక్ చేసేందుకు రెడీ అయింది. మరి  ప్రమోషన్లలో కృతి చేసిన ఈ సెన్సేషన్ కామెంట్స్  ఏ మేరకు కాసులు కురిపిస్తాయో చూడాలి.

also read:పదేళ్ల క్రితమే ఆ కథలు రాసేశారా? బాక్సాఫీస్ హిట్స్ వెనుక డైరెక్టర్ జయశంకర్ ‘మాస్టర్ మైండ్’!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×