E-Paper
Advertisement

టాలీవుడ్ ‘డేట్స్’ గేమ్.. మేకర్స్ సైలెంట్.. చిన్న సినిమాలు వయొలెంట్! చరణ్, నాని ఎందుకిలా చేస్తున్నారు?

టాలీవుడ్ ‘డేట్స్’ గేమ్.. మేకర్స్ సైలెంట్.. చిన్న సినిమాలు వయొలెంట్! చరణ్, నాని ఎందుకిలా చేస్తున్నారు?
Advertisement

Tollywood Delays :సినిమా మొదలైనప్పుడు,జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి,తీరా సినిమా రిలీజ్ అవుతున్న డేట్లకి ఇపుడు ఎక్కడా పొంతన ఉండట్లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఈ వాయిదాల పాట మరీ ఎక్కువైపోయింది.మా సినిమా మా ఇష్టమొచ్చినప్పుడు రిలీజ్ చేసుకుంటాం అనడానికి లేదిక్కడ.ఎందుకంటే ఈ భారీ సినిమాల రిలీజ్ లపైనే పదుల సంఖ్యలో చిన్న సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉంటాయ్ కాబట్టి.ఇక తాజాగా వస్తామంటూ ఊరిస్తూ తీరా రాలేమంటూ పోస్ట్ పోన్ చేస్తున్న పెద్ది, ప్యారడైజ్ లు అసలు ఎప్పుడొస్తాయో తెలీక చిన్న చితకా నిర్మాతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.

పెద్ది ఆ తేదీకి కూడా రావడం కూడా  డౌటే ?

Advertisement

చరణ్ పెద్ది విషయానికే వస్తే బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మొదలెట్టినప్పుడు 2026 మార్చి 27న పక్కా అన్నారు.తీరా డేట్ దగ్గర పడుతున్నకొద్దీ అబ్బే ఇప్పుడు కాదు ఏప్రిల్ 30, 2026కి అంటూ వాయిదాల పాట పాడారు. కానీ లేటెస్ట్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తుంటే ఆ తేదీకి కూడా రావడం డౌట్ గానే ఉంది.ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ నుంచి సాంగ్ షూటింగ్ ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్.అంటే రిలీజ్ కి  పట్టుమని నెల రోజులు కూడా లేని ఈ సమయంలో ఇంకా షూట్ అంటే అనుకున్న డేట్ కి  అసలు వచ్చే చాన్స్ లేదంటూ ఇప్పటికే క్లారిటీ కొచ్చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇంత క్లారిటీగా కనిపిస్తున్నా మేము చెప్పిన తేదీకి రావట్లేదని పెద్ది టీమ్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడమే ఇక్కడ అసలు సమస్య.

 బాగా నష్టపోతున్న డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు

Advertisement

ఇక ‘పెద్ది’ వస్తుందనే భయంతో ‘లెనిన్’ వంటి మీడియం రేంజ్  సినిమాలు తమ తేదీలను అటు ఇటు షఫుల్ చేస్తున్నాయ్.ఇప్పుడు చరణ్ సినిమా రాదు,అటు లెనిన్ సినిమాకు మంచి డేట్ దొరకదు.అంటే సరైన డేట్ చెప్పకపోవడం వల్ల చిన్న, మీడియం రేంజ్ సినిమాల డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు బాగా నష్టపోతున్నారన్న మాట. ఇక  సమంత ‘మా ఇంటి బంగారం’విషయానికి వస్తే  ఫిబ్రవరి 24న మే 15న వస్తామని అనౌన్స్ చేసింది మూవీ టీమ్.  ఒకవేళ ‘పెద్ది’ తప్పుకుంటే ఈ సినిమా కూడా  ఏప్రిల్ 30కే రావాలని ప్లాన్ వేసింది.దీనితో పాటు  ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ కూడా మే మొదటి వారాన్ని టార్గెట్ చేసినదే. కానీ ‘పెద్ది’ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో వీళ్లంతా ఇపుడు  డైలమాలో పడ్డ పరిస్థితి. లేటెస్ట్ టాక్ ప్రకారం జూన్ 25 అని వినిపిస్తుంది.కాని మేకర్స్ ఇంకా నోరు విప్పని పరిస్థితి.

also read:యష్ రావణుడిగా మెప్పిస్తాడా లేక సైఫ్ అలీఖాన్ లా మిగిలిపోతాడా…నితేష్ తివారికి తిప్పలు తప్పవా?

ప్యారడైజ్ డిసెంబర్ రేసులోకి వెళ్లే ఛాన్స్ 

పెద్దితో చరణ్ ఇలా వాయిదాల పాట పాడుతుంటే నేచురల్ స్టార్ నాని ‘ది పారడైజ్’ పరిస్థితి కూడా ఇంతకన్నా గొప్పగా ఏం లేనట్టే కనిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తున్నఈ సినిమాను ముందుగా మార్చి 26, 2026న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే రణ్ వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ క్లాష్ తప్పించుకోవడానికి,అలాగే  క్వాలిటీ కోసం అంటూ ఫిబ్రవరి 13వ తేదీన ఒక పోస్టర్ వదిలి సినిమాను ఆగస్టు 21, 2026కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.అయితే, ఇప్పటివరకు కేవలం 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావడంతో ఆ తేదీకి రావడం కూడా కష్టమేనని ఇపుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.దీనికి తోడు అనిరుధ్ వంటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకోవడంతో, ఆ అవుట్ పుట్ రావడానికి మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది. ట్రెండ్ చూస్తుంటే  ఈ సినిమా డిసెంబర్ రేసులోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు కూడా.

సరైన ప్లానింగ్ లేకపోవడమే

ఏది ఏమైనా ఈ గందరగోళానికి ప్రధాన కారణం సరైన  ప్లానింగ్ లేకపోవడమే అన్నది ట్రేడ్ పండితుల మాట. షూటింగ్ ఎంతవుతుందో, ఎప్పుడవుతుందో తెలియకుండానే తేదీలు ప్రకటించడం, ఆ తర్వాత  ఇలా వాయిదాల పాట పాడటం వల్ల చిన్న సినిమాల  మార్కెట్ దెబ్బతింటోందన్నది కాదనలేని సత్యం.ఎందుకంటే ఒక పెద్ద సినిమా వాయిదా పడినప్పుడు, ఆ తేదీని ఉపయోగించుకోవడానికి చిన్న సినిమాలు రెడీగా ఉంటాయి.కానీ పెద్ద సినిమాలు ఇలా లాస్ట్ మినట్ వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో చిన్న సినిమాలు ప్రమోషన్లకు సమయం లేక, థియేటర్లు దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా బాక్సాఫీస్ కళకళ లాడాలంటే బడా స్టార్స్ అండ్ డైరెక్టర్స్ మేకింగ్ మీద మాత్రమే కాదు, రిలీజ్ డేట్స్ విషయంలో కూడా కాన్సన్ ట్రేట్ చేస్తే మంచిది.

also read:హీరో లేడు.. ఐటెం సాంగ్స్ లేవు.. కేవలం ఆమె నటనతోనే 200 కోట్లు! ఆ ‘వేశ్య’ కథకు ఏకంగా 49 అవార్డులు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×