E-Paper
Advertisement

Dude Director: నేను ఆర్య సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆర్య 2 చూసి ఉంటే అది జరిగేది

Dude Director: నేను ఆర్య సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆర్య 2 చూసి ఉంటే అది జరిగేది
Advertisement

Dude Director: తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారు అని ఎప్పటి నుంచో ప్రూవ్ అవుతూ వస్తుంది. అలానే చాలామంది తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ కి సంబంధించిన హీరోలకు ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. రజనీకాంత్ ,కమల్ హాసన్, విక్రమ్, సూర్య, విశాల్, శింబు వంటి ఎందరో హీరోలు సినిమాలు ఒకప్పుడు బాగా పాపులర్ గా ఇక్కడ ఆడేవి.

కానీ తెలుగు హీరోల సినిమాలు తమిళ్ లో అంత పెద్దగా ఆడేవి కాదు. గట్టిగా మాట్లాడితే అక్కడ కొంచెం థియేటర్లు కూడా దొరికావు కాదు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాకి మంచి రెస్పెక్ట్ రావడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల్లో నిర్మితమయ్య భారీ బడ్జెట్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రీసెంట్గా డ్యూడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ఆర్య సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను 

Advertisement

డ్యూడ్ సినిమా చూసినప్పుడు చాలామందికి గుర్తొచ్చిన సినిమా ఆర్య 2. ఎందుకంటే ఆర్య 2 సినిమాలు ఆర్య గీతా ను పెళ్లి చేసుకుని అజయ్ కు అప్పచెప్పే ఉద్దేశంలో ఉంటాడు. ఆ పాయింట్ ను సుకుమార్ డీల్ చేసిన విధానం అప్పట్లో విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆర్య సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వలన ఆర్య 2 సినిమాకి ఊహించిన రేంజ్ సక్సెస్ రాలేదు. కానీ ఆర్య 2 కూడా మంచి సినిమా.

డ్యూడ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇదే అభిప్రాయం కలిగింది. అయితే దర్శకుడు కీర్తి కూడా ఈవెంట్లో మాట్లాడుతూ ఈ సినిమా నేను రాయడానికి ఆర్య సినిమా ఇన్స్పిరేషన్ అన్నాడు. అయితే అందరూ కూడా ఆర్య 2 సినిమాని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ సినిమా రాశాడు అని భావించారు. దానిపై రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కీర్తి.

ఆర్య 2 చూసుంటే ఇంకోలా ఉండేది 

Advertisement

అయితే వాస్తవానికి ఆర్య సినిమా చూసి దర్శకుడు కీర్తి ఇన్స్పైర్ అయ్యాడట. ఆర్య 2 సినిమా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు మాత్రమే చూశాడట. ముందే ఆర్య 2 సినిమా చూసి ఉంటే ఆ ఇన్ఫ్లెన్స్ ఈ సినిమా మీద కూడా ఉండేది అని క్లారిటీ ఇచ్చాడు. ఆర్య సినిమా చూసిన తర్వాతే ఈ కథను రాశాను అని చెప్పేసాడు.

మొత్తానికి కీర్తి ఆర్య 2 సినిమాను చూడకపోవడం ఒకరకంగా మంచిదే. ఒకవేళ చూసినట్లయితే ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ సినిమా ఎటేటో మలుపులు తిరిగేది. సినిమా ఫలితం విషయంలో కూడా కొద్దిపాటి డిఫరెంట్ వచ్చేది అనేది కొంతమంది అభిప్రాయం.

Also Read: Mari Selvaraj: నేను అలాంటి సినిమాలే తీస్తాను దయచేసి నన్ను వదిలేయండి

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×