Mari Selvaraj: తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో మారి సెల్వరాజ్ ఒకరు. పెరియారుమ్ పెరుమాళ్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారి. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది అప్పట్లో సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి విపరీతమైన పాజిటివ్ పోస్టులు కనిపించాయి. ఆ తర్వాత ధనుష్ హీరోగా చేసిన కర్ణన్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్ గా ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ సినిమాకి దర్శకత్వం వహించాడు మారి సెల్వరాజ్.
అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా తమిళ్లో విడుదలైంది. అయితే తెలుగులో అప్పటికే ఏకంగా నాలుగు సినిమాలు పోటీలో ఉండటం వలన ఈ సినిమా డబ్బింగ్ విడుదల చేయలేదు. అక్టోబర్ 24న తమిళ్ వర్షన్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మీద కూడా విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలా చోట్ల ఈ సినిమాకి హౌస్ల్ బోర్డ్స్ కూడా పడుతున్నాయి. అయితే అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా బాగున్న కూడా అణగారిన వర్గాలు, ఆధిపత్య వర్గాలు మధ్య సినిమాలు మాత్రమే వస్తున్నాయి అని అందరూ కామెంట్ చేస్తున్నారు. తమిళ దర్శకులు ఇవి తప్ప ఇంకేమీ తీయరా అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా టోలింగ్ చేస్తున్నారు.
అయితే మారి సెల్వరాజ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా కాస్ట్ బేస్ ఉంటాయి. దీని గురించి పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైన మారి సెల్వరాజ్ రియాక్ట్ అయ్యాడు.
ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నావని అడగకండి, అది నన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నేను కాస్ట్ వ్యతిరేక సినిమా తీసుకుంటానని చాలా గట్టిగా ఉన్నాను. ఎంటర్టైన్మెంట్ సినిమాలు 300 వస్తున్నాయి, నన్ను వదిలేయండి.
సినిమా ద్వారా అయితే ఎంటర్టైన్ చేయాలి లేకపోతే ఎడ్యుకేట్ చేయాలి. అయితే ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఎడ్యుకేట్ చేసే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. బహుశా అందుకేనేమో ఇటువంటి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటాడు మారి సెల్వరాజ్. మొత్తానికి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది.
Also Read: Ustaad Bhagat Singh : ఇంకా షూటింగ్ దశలో ఉస్తాద్ భగత్ సింగ్, రిలీజ్ పరిస్థితి ఏంటి?