BigTV English
Advertisement

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Duvvada Madhuri: బిగ్ బాస్ సీజన్ 9 లో 5 వారాల తర్వాత ఫైర్ స్ట్రోమ్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో దువ్వాడ మాధురి మరియు అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య కూడా ఉన్నారు. అయితే దువ్వాడి మాధురి అందరి రంగులు బయట పెడతాను ఎవరూ కూడా ఇంకా బయటపడలేదు నటిస్తున్నారు అని స్టేజ్ మీద చెప్పింది.


మాధురి చెప్పిన మాదిరిగానే హౌస్ లోకి వెళ్లి వెళ్ళగానే శ్రీజ దమ్ముతో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేసింది. కేవలం పేరు విషయంలోనే చాలా రచ్చ చేసింది. అయితే తర్వాత రోజు కిచెన్ మానిటర్ గా ఉన్న దివ్యతో విపరీతమైన గొడవ పెట్టుకుంది. అలానే వెటకారమైన సమాధానాలు కూడా చాలా చెప్పింది. ఆ గొడవలో భాగంగా చాలా ఆర్గ్యుమెంట్స్ చేసింది మాధురి.

ఒక వారంలో ఊహించని మార్పు

కిచెన్ లో వచ్చిన రెండో రోజు భారీ గొడవ పెట్టుకుంది. దివ్యాను ఉద్దేశిస్తూ నేను మీకు లాగా నాన్న నాన్న అని నేను వెనకాల తిరగను. నేనిక్కడ బంధాల కోసం రాలేదు. గేమ్ ఆడటం కోసం వచ్చాను. బంధాలు బంధుత్వాలు నాతో నడవవు. అంటూ ఒక ఫైర్ బ్రాండ్ లాగా విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసింది.


కానీ ఇప్పుడు దువ్వాడ మాదిరి తనుజ కి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ముద్దులు పెట్టేస్తుంది. ఇది బంధమే కదా అని చాలామందికి అర్థం అయిపోతుంది. మరోవైపు బయట కూడా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తనుజ వాళ్ళనే భరణి బయటకు వచ్చాడు అని ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడా చేశాడు. అయితే ఈ తరుణంలో ఏకంగా దువ్వాడ మాధురితో బాండింగ్ కంటిన్యూ చేస్తుంది తనుజ.

మార్పు వస్తుందా? 

అయితే గేమ్ ఆడడానికి వచ్చాను అందరి రంగులు బయటపడతాను అని చెప్పిన మాధురి ఇప్పటికైనా గేమ్ స్టార్ట్ చేసి అందరి రంగులు బయటపెట్టే ప్రయత్నం చేస్తుందా? లేకపోతే తనుజాతో బంధంలో మునిగిపోయి తన గేమ్ పాడు చేసుకుంటుందా అనేది చాలామందికి ఉన్న ఆలోచన.?

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉన్న ఫైర్ ఇప్పుడు దువ్వాడ మాధురి లో కనిపించడం లేదు. అయితే ఈ విషయాలన్నిటినీ కూడా రమ్య మోక్ష చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ అది మాధురి తీసుకోలేక పోతుంది. చాలామందికి హౌస్ మేట్స్ మీద ఉన్న అభిప్రాయాలని రమ్య చెబుతుంది కానీ హౌస్ మేట్స్ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ముందు ముందు మాధురి ఆట ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

Also Read : Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Related News

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Big Stories

×