 
					Big tv Kissik Talks: సినీనటి కస్తూరి శంకర్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి అభిమానులతో మాట్లాడారు ముఖ్యంగా ఈమె గత ఏడాది అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే. తమిళనాడులో ఓ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ .. తమిళనాడులో నివసిస్తున్న ఆంధ్రులు పూర్వం తమిళనాడులోని అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వాళ్లే ఇప్పుడు తమిళలుగా చలామణి అవుతున్నారు అంటూ ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇక ఈ విషయం గురించి ఈమె స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్న తెలుగు వారిని అవమానకరంగా కస్తూరి శంకర్ మాట్లాడారని ఈమెపై చర్యలు తీసుకోవాలి అంటూ అప్పట్లో ఎంతో మంది డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే కస్తూరి శంకర్ పై కేసు నమోదు కావడం ఈమెను అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు గురించి కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. అప్పటికే తాను పలు విషయాల గురించి మాట్లాడటంతో ప్రభుత్వాలు నాపై కక్ష కట్టి నన్ను జైలుకు పంపించారని తెలిపారు.. అయితే నాకు ఈ విషయం అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ అయినప్పుడు స్పష్టంగా తెలిసిందని ఈమె తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది ఆయన తలరాత అంటూ పుష్ప సినిమా తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం గురించి మాట్లాడారు.
ఇలా జైలుకు వెళ్లినప్పుడు తాను నరకం అనుభవించానని తెలిపారు. అయితే జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా నేరం చేసిన వాళ్ళు కాదని ఈ సందర్భంగా ఈమె మరోసారి గుర్తు చేశారు. జైలు జీవితం ప్రతి ఒక్కరిని మారుస్తుందని తనకు కూడా ఎన్నో గుణ పాఠాలు నేర్పిందని కస్తూరి శంకర్ తెలిపారు. ఇక జైలులో చాలా దుర్భరమైన జీవితాన్ని గడపాలి .సినిమాలలో చూపించిన విధంగా జైలు జీవితం ఉండదని నరకం ఏంటో తెలియాలి అంటే జైలుకు వెళ్తే చాలు అంటూ ఈమె తెలిపారు.
ఇలా తన జైలు జీవితం గురించి కస్తూరి శంకర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అయితే అల్లు అర్జున్ అరెస్టు అయినప్పుడు కూడా ఈమె అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందిస్తూ తన వాదనని వినిపించారు. ఇక అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈయన అరెస్ట్ అయిన కాసేపటికే బెయిల్ దొరికినప్పటికీ ఒకరోజు రాత్రి మొత్తం తనని జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర ఉందనే వాదన కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Also Read: Big tv Kissik Talks: తెలుగు బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో చెప్పేసిన కస్తూరి.. కప్పు అతనిదే అంటూ!