E-Paper
Advertisement

Director Krish: ఏడుగురు హీరోయిన్లతో సినిమా నిజం కాదు.. ఏసేశాడు.. బాగా ఏసేశాడు!

Director Krish: ఏడుగురు హీరోయిన్లతో సినిమా నిజం కాదు.. ఏసేశాడు.. బాగా ఏసేశాడు!
Advertisement

Director Krish: ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ఆలస్యం కావడంతో, ఆ సినిమా వదిలేసి స్వీటీ అనుష్కతో ‘ఘాటి’ (Ghaati) పూర్తి చేసిన డైరెక్టర్ క్రిష్ (Director Krish).. ఆ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయారు. ఎన్నో ఆశలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో క్రిష్ తదుపరి ఏ తరహా సినిమా చేస్తాడనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్రిష్ చేయబోయే తదుపరి సినిమాకు సంబంధించి రకరకాలుగా వార్తలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా క్రిష్ తదుపరి సినిమాలో ఏడుగురు హీరోయిన్లు చేయబోతున్నారనేలా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఆ ఏడుగురు హీరోయిన్లలో కొంతమంది పేర్లు కూడా పెట్టేసి కథనాలు అల్లేస్తున్నారు. అలా వార్తలు క్రియేట్ చేస్తున్న వారందరికీ క్రిష్ సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చారు. దీంతో, నెటిజన్లు.. ‘ఏసేశాడు.. క్రిష్ బాగా ఏసేశాడు’ అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ క్రిష్ ట్వీట్‌లో ఏముందంటే..

Also Read- Horror Movie OTT : ఓటీటీలోకి అడుగు పెట్టిన 4100 కోట్ల మూవీ… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు

గాసిప్ రాయుళ్లపై సెటైర్

Advertisement

క్రిష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌లో ఏడుగురు హీరోయిన్లతో ఒక భారీ ట్రెకింగ్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నారని, ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై క్రిష్ స్పందిస్తూ.. ‘‘ఏడుగురు హీరోయిన్లు.. ట్రెకింగ్ అడ్వెంచర్.. వినడానికి మంచి ఐడియానే కానీ, ఇది నిజం కాదు. ఇది కేవలం సోషల్ మీడియా, రూమర్లు క్రియేట్ చేసిన మరొక స్క్రిప్ట్ మాత్రమే’’ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైరికల్‌గా స్పందించారు. గాసిప్ రాయుళ్లు ఊహించుకుంటున్న కథలకు, వాస్తవానికి పొంతన లేదని ఆయన ఈ ట్వీట్‌తో తేల్చి చెప్పారు. రూమర్లను కొట్టిపారేయడమే కాకుండా, తన అసలు సినిమా విశేషాలను త్వరలోనే పంచుకుంటానని క్రిష్ హామీ ఇచ్చారు. ‘‘నా తదుపరి సినిమాకు సంబంధించిన నిజమైన ప్రకటనను త్వరలోనే షేర్ చేస్తాను” అని ఆయన పేర్కొనడంతో, క్రిష్ తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? కథాంశం ఏమిటి? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో మొదలైంది.

Also Read- Hey Bhagavan: ‘హే భగవాన్’ కంటే ముందు పది కథలు.. ఏదీ నచ్చలేదంటోన్న నిర్మాత!

క్రిష్ మార్క్ మూవీ కోసం ఎదురుచూపులు

Advertisement

‘గమ్యం, వేదం, కంచె’ వంటి క్లాసిక్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న క్రిష్, ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి క్రిష్ తప్పుకున్నప్పటికీ, ఆయన ఎందుకు తప్పుకున్నారనేది క్లారిటీ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ టీమ్ కూడా ఆయనను ఎంతగానో గౌరవించింది. కానీ, అనుష్కతో చేసిన ‘ఘాటి’ విషయంలోనే క్రిష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మంచి హిట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేయాలి.. లేదంటే, రేస్‌లో వెనుకబడినట్లే. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ నుంచి వచ్చే ‘రియల్ అనౌన్స్‌మెంట్’ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

Also Read- Sri Chidambaram Garu OTT: రెండు వారాలకే ఓటీటీలోకి ‘శ్రీ చిదంబరం గారు’.. స్ట్రీమింగ్ వివరాలివే!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×