E-Paper
Advertisement

Horror Movie OTT : ఓటీటీలోకి అడుగు పెట్టిన 4100 కోట్ల మూవీ… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు

Horror Movie OTT : ఓటీటీలోకి అడుగు పెట్టిన 4100 కోట్ల మూవీ… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు
Advertisement

Horror Movie OTT : భయపెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హఠాత్తుగా వచ్చే హర్రర్ సీన్స్ ఉండే భయంకరమైన సినిమాలంటే థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ స్పెషల్ క్రేజ్ ఉంది. తాజాగా అలా ఇప్పటికే థియేటర్లలో భయపెట్టి, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో హర్రర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్న మూవీ ఒకటి తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ అత్యంత భయంకరమైన మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

కంజురింగ్ ఫ్రాంచైజీలో నాల్గవ భాగం, మొత్తం కంజురింగ్ యూనివర్స్‌లో తొమ్మిదవ చిత్రంగా తెరపైకి వచ్చింది ‘ది కంజురింగ్ : లాస్ట్ రైట్స్’ (The Conjuring: The Last Rites). ఇందులో అన్నాబెల్లె, ది నన్ వంటి స్పిన్-ఆఫ్‌లు కూడా ఉండడం విశేషం. మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ సినిమా 2025 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించింది. పారానార్మల్ నిపుణులు ఎడ్, లోరైన్ వారెన్‌ల చివరి మూవీ. దాదాపు థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఈ గ్రిప్పింగ్ అతీంద్రియ గాథ డిజిటల్ ప్రీమియర్‌ అయ్యింది. హాలీవుడ్‌లో ఘనమైన బాక్సాఫీస్‌ సక్సెస్ సాధించిన ఈ మూవీ ఏకంగా 4100 కోట్లను రాబట్టింది. ఒక్క భారతదేశంలోనే ఈ చిత్రం రూ. 83.25 కోట్లు సంపాదించింది. సుమారు 120 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.8 రేటింగ్ తెచ్చుకుంది. ‘ది కంజురింగ్’ సిరీస్ మునుపటి చిత్రాలలో కంజురింగ్, కంజురింగ్ 2, ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ ఉన్నాయి.

Advertisement

Read Also : పెళ్లి చూపుల గోల తట్టుకోలేక ప్రేమికులుగా నాటకాలు… ప్యూర్ ఫ్యామిలీ డ్రామా

ఈ సినిమా భయంకరమైన సినిమాలను ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్. పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా నటన, హర్రర్ సన్నివేశాలు, క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా కంజురింగ్ సిరీస్ ఫ్యాన్స్‌కు ఇది చివరి భాగం కావడం వల్ల ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఇందులో ఉన్న యాక్షన్, డ్రామా, హర్రర్ సీట్ ఎడ్జ్ ఫీల్ ఇస్తాయి. జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీని తెలుగులో చూడవచ్చు. ఫిబ్రవరి 13 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడటానికి బాగుంటుంది కానీ హర్రర్ సీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలతో చూడకపోతేనే బెటర్.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ ఎడ్ (పాట్రిక్ విల్సన్), లోరైన్ (వెరా ఫార్మిగా) వారెన్‌ల చివరి కేస్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 1986 లో జరిగిన ప్రసిద్ధ “స్మర్ల్ హాంటింగ్” కేసు ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో కొన్ని భయంకరమైన శక్తులు పాత అద్దం ద్వారా ఓ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాయి. ఈ కథ మరో కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఎడ్, లోరైన్ లను కూడా బెదిరించే దుష్ట శక్తి చుట్టూ తిరుగుతుంది. గత చిత్రాలలో ఇంకా పరిష్కారం కాని కొన్ని రహస్యాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఇది కేవలం హర్రర్ సినిమా మాత్రమే కాదు. ఎడ్ – లోరైన్ ల ప్రేమ, పోరాటానికి భావోద్వేగ ముగింపు కూడా. ఈ సినిమా మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది. మైఖేల్ చావ్స్ ఇందులో అనేక భయంకరమైన దృశ్యాలను యాడ్ చేశారు. అవేంటి అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×