E-Paper
Advertisement

Royal Enfield Mettle Helmet: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త హెల్మెట్, ఫీచర్లు అదుర్స్ భయ్యా!

Royal Enfield Mettle Helmet: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త హెల్మెట్, ఫీచర్లు అదుర్స్ భయ్యా!
Advertisement

Royal Enfield Mettle Helmet Review: రాయల్ ఎన్ఫీల్డ్ రీసెంట్ గా చక్కటి హెల్మెట్ ను తయారు చేసింది. మెట్లే హెల్మెట్ పేరుతో దీనిని మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. అదరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోబోతోంది. ఇది పిన్‌లాక్ 30 యాంటీ ఫాగ్ ఇన్సర్ట్,  రిమూవబుల్ లైనర్లు, స్పీకర్ రీసెస్లతో వస్తుంది. ప్లెయిన్ మ్యాట్ బ్లాక్ వెర్షన్ ధర రూ. 7,500,  గ్రాఫిక్స్‌ తో కూడిన గ్లోస్ కలర్‌ వేస్ ధర రూ. 8,000గా ఉండబోతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెట్లే గురించి..

మెట్లే హెల్మెట్‌ XS, XL పరిమాణాల్లో ఉండబోతోంది. ఈ హెల్మెట్ మ్యాట్ బ్లాక్, గ్రాఫిక్స్‌ మ్యాట్ గ్రే, గ్రాఫిక్స్‌ గ్లోస్ వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఇది షెల్ మెటీరియల్,  థర్మో ప్లాస్టిక్, ABS మిశ్రమంతో తయారు చేయబడింది. ఫాస్ట్నర్ రకం డబుల్ D రింగ్ గా ఉంటుంది. ఈ హెల్మెట్ కు ECE 22.06, ISI, DOT సర్టిఫికేషన్ ఉంది. ఈ హెట్మెల్ బరువు సుమారు 1850 గ్రాములు ఉంటుంది. రీసెంట్ గా M సైజ్ హెల్మెట్ ను కంపెనీ పరీక్షించింది. ఇందులో అంతర్గత డ్రాప్ డౌన్ టిన్టెడ్ వైజర్‌ తో పిన్‌ లాక్ 30 యాంటీ ఫాగ్ ఇన్సర్ట్‌ తో క్లియర్ వైజర్ ను కలిగి ఉంటుంది. వెంటిలేషన్ విషయానికి వస్తే, చిన్ వెంట్, వెనుక ఎగ్జాస్ట్ పోర్ట్ లతో డ్యూయల్ టాప్ ఇన్‌ టేక్ వెంట్స్ ఉన్నాయి. లైనర్లు తొలగించి ఉతికేలా ఉన్నాయి. ఇంటర్‌ కామ్ సిస్టమ్‌ల కోసం స్పీకర్ రీసెస్‌లు ఉన్నాయి.

అనుకూల, ప్రతికూల అంశాలు

Advertisement

ఇక మెట్లే హెల్మెట్‌ కు సంబంధించి కొన్ని అనుకూల అంశాలతో పాటు కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. తాజా ECE 22.06 సర్టిఫికేషన్, రైడింగ్ చేస్తున్నప్పుడు లైట్ వెయిట్ గా ఉండటం ప్లస్ పాయింట్స్ కాగా, చిన్న ఐ పోర్ట్ విజుబులిటీ,   గ్లాసెస్ అనుకూలత అంత గొప్పగా ఉండకపోవడం, సన్ విజర్ మెకానిజం కాస్త గజిబిజిగా అనిపించడం మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు.

Read Also: టాటా To మారుతి సుజుకి.. మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు!

డిజైన్, ఫిట్, సేఫ్టీ

Advertisement

మెట్లే  హెల్మెట్ చాలా సింపుల్ గా ఫుల్ ఫేస్ ను కవర్ చేసే డిజైన్ ను కలిగి ఉంది. షెల్ క్లీన్ గా ఉంటుంది. ఇది తాజా ECE 22.06 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ISI, DOT సర్టిఫికేషన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ హెల్మెట్ పెట్టుకున్నాక కళ్ల జోడు పెట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. విజుబులిటీ కూడా పరిమితంగా ఉంటుంది. యాక్చుయేషన్ మెకానిజం అంత సున్నితంగా ఉండదు. హెల్మెట్ ఎడమ వైపున ఉన్న స్లయిడర్ ఉపయోగించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  మొత్తంగా ఈ హెల్మెట్ ప్రైమరీ సేఫ్టీని అందిస్తుంది. లాంగ్ రేంజ్ ప్రయాణాలకు ఈ హెల్మెట్ అనుకూలంగా ఉంటుంది.

Read Also: చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×