E-Paper
Advertisement

Pawan Kalyan: సర్దార్ పవన్ కళ్యాణ్.. కొత్త అవతారంలో సర్‌ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్, ఫొటోలు వైరల్

Pawan Kalyan: సర్దార్ పవన్ కళ్యాణ్.. కొత్త అవతారంలో సర్‌ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్, ఫొటోలు వైరల్
Advertisement

Pawan Kalyan: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఒకరు ఈయన చిరంజీవి తమ్ముడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తన నటన నైపుణ్యంతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు అందులో కూడా సక్సెస్ ఫ్లాప్ సినిమాలు సమానంగా ఉన్నాయి అయినప్పటికీ ఈయనకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు.

గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమం..

ఇలా రాజకీయ, సినీ కార్యకలాపాలలో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఈయన సర్దార్ లుక్ లో కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva)తో కలిసి ఇటీవల మహారాష్ట్రలో నాందేడ్‌లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా..

Advertisement

ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ తలకు పాగా మెడలో కండువా , సార్వాని ధరించి కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ సర్దార్ లుక్ లో కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పలు సినిమాల పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాని మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ ఇటీవల సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

Also Read: Murali Mohan: లేట్ అయినా లేటెస్టుగా వచ్చింది.. ‘పద్మశ్రీ’పై మురళీ మోహన్ ఫస్ట్ రియాక్షన్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×