E-Paper
Advertisement

Lokesh Kanagaraj: తెలుగు డైరెక్టర్ గా మారబోతున్న లోకేష్ కనగరాజ్.. స్టార్ హీరోతో సినిమా ఫిక్స్?

Lokesh Kanagaraj: తెలుగు డైరెక్టర్ గా మారబోతున్న లోకేష్ కనగరాజ్.. స్టార్ హీరోతో సినిమా ఫిక్స్?
Advertisement

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇప్పటివరకు ఆరు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇక లోకేష్ ఒక వైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరోవైపు హీరోగా కూడా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఈయన హీరోగా “DC” సినిమా (DC Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల టైటిల్ గ్లింప్ విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది.

తెలుగు సినిమాకు డైరెక్టర్ గా లోకేష్?

ఇలా లోకేష్ కనగరాజ్ ఒకవైపు హీరోగా సినిమా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా తన సినిమా పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈయనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా తన ఏడవ సినిమాని తెలుగులో చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఈయన పూర్తిస్థాయి తెలుగు దర్శకుడిగా మారబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోకి లోకేష్ కథ వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పనులలోనే బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తుంది.

లోకేష్ డైరెక్ట్ చేయబోతున్న హీరో ఎవరు?

Advertisement

మరి లోకేష్ తెలుగులో ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు.. ఆ హీరో ఎవరు సినిమా కథ ఏంటి అనే విషయాలు త్వరలోనే అధికారకంగా రాబోతున్నాయని ఇండస్ట్రీ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీంతో కలిసి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు మరోవైపు ఈయన హీరోగా చేస్తున్న సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తరువాతనే లోకేష్ కార్తీతో ఖైతి 2 పనులను ప్రారంభించబోతున్నట్టు సమాచారం.

రజనీకాంత్ తో కూలి..

Advertisement

ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతోమంది తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ హీరోలు కూడా పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ లోకేష్ సైతం తెలుగు స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక లోకేష్ దర్శకత్వంలో ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అయింది.. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కానీ అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Also Read: Aryan Rajesh:ఇండస్ట్రీకి దూరంగా ఆర్యన్ రాజేష్.. అసలు కారణం చెప్పిన నరేష్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×