E-Paper
Advertisement

Smriti Mandhana wedding: పలాష్ ముచ్చల్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. రంగంలోకి స్మృతి మందాన మాజీ ప్రియుడు ?

Smriti Mandhana wedding: పలాష్ ముచ్చల్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. రంగంలోకి స్మృతి మందాన మాజీ ప్రియుడు ?
Advertisement

Smriti Mandhana wedding: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాహం వాయిదా పడడం వెనక స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో పాటు, వరుడు పలాశ్ పై వచ్చిన మోసం ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసాయి.

Also Read: Ms Dhoni: గంభీర్ ను ఏకాకి చేసిన ధోని… ఇది కదా అసలు రివేంజ్.. ఈ వీడియో చూస్తే!

Advertisement

నిజానికి స్మృతి పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. కానీ అదే రోజు ఆమె తండ్రి గుండెపోటు లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో వివాహాన్ని స్మృతి నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పలాశ్ సైతం యాసిడిటీ, ఇన్ఫెక్షన్ తో సాంగ్లీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. కానీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో నవంబర్ 24న అతడు ముంబైలోని మరో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.

 

స్మృతి తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్:

Advertisement

స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ నవంబర్ 25న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక పలాశ్ కూడా ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. పలాశ్ ఒత్తిడికి గురికావడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. ఇక మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని పలాశ్ కి వైద్యులు సూచించారు. అయితే వివాహం వాయిదా పడిన వెంటనే సోషల్ మీడియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో అనేక ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. పలాశ్ పై వచ్చిన కొన్ని ఆరోపణల కారణంగా వీరి సంబంధంలో సమస్యలు తలెత్తినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్స్ వైరల్ అవుతున్న సమయంలోనే స్మృతి మందానా తన సోషల్ మీడియా ఖాతాల నుండి పలాశ్ తో జరిగిన నిశ్చితార్థం, పెళ్లికి ముందు వేడుకలకు సంబంధించిన అన్ని ఫోటోలను డిలీట్ చేసింది. స్మృతి స్నేహితులు, ఆమె సహచర క్రీడాకారినులు కూడా ఈ సంఘటనలకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారు. అయితే పలాశ్ వేరే మహిళతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలాశ్.. స్మృతిని మోసం చేశాడనే ఊహాగానులకు దారితీసింది.

 

స్మృతి – పలాశ్ ఎపిసోడ్ లో ట్విస్ట్:

 

ఇప్పటివరకు పలాశ్ ఓ మహిళా కొరియోగ్రాఫర్ మేరీ డీ కొస్టా తో సీక్రెట్ చాట్ చేసినట్లు కొన్ని చాటింగ్ స్క్రీన్ షాట్ లు నెట్టింట వైరల్ అయ్యాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు పలాశ్ ఆ మహిళతో సన్నిహితంగా ఉండాలని కోరినట్లు ఈ చాట్ లు సూచించాయి. అయితే ఈ విషయం తెలిసి స్మృతి కుటుంబంలో కలకలం రేగిందని.. ఈ కారణంగానే ఆమె తండ్రి అనారోగ్యానికి గురయ్యారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది.

Also Read: Smriti Mandhana Wedding: ప్చ్ సైలెన్స్… స్మృతి – పలాశ్ పెళ్లి జరుగుతుంది

అయితే ఇప్పుడు మరో వాదన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలాశ్ కాదు.. స్మృతినే అతడిని మోసం చేసిందని.. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసుపత్రిలో ఉన్న స్మృతి తండ్రిని పరామర్శించేందుకు కూడా అతడు వచ్చాడని ఓ వీడియో ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. కానీ ఇది ఫేక్ అని తేలింది. తాజాగా పలాశ్ తల్లి.. స్మృతి – పలాశ్ పెళ్లి త్వరలోనే జరగబోతుందని ప్రకటించింది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Vishal Jeswani (@_mai_hu_vishal_)

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×