E-Paper
Advertisement

Director Maruthi: కాలర్‌ ఎగిరేయడంపై సెటైర్లు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన మారుతి

Director Maruthi: కాలర్‌ ఎగిరేయడంపై సెటైర్లు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన మారుతి
Advertisement

Maruthi Apologizes to Jr NTR Fans:పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ది రాజా సాబ్‌. నిన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజైంది. ఈ ఈవెంట్‌లో మారుతి సినిమా గురించి మాట్లాడుతూ ఓ రేంజ్‌లో ఎలివేషన్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో అతడు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన తీరు, కామెంట్స్‌ ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ భగ్గమంటున్నారు. దీనికి కారణం ఆయన కాలర్‌ ఎగిరేస్తారనే ప్రసావన తీసుకురావడమే.

మారుతిపై భగ్గమంటున్న ఫ్యాన్స్‌

ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ది రాజా సాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్ సందర్భంగా నిర్వహంచిన మూవీ ఈవెంట్‌లో మారుతి మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాను సంక్రాతికే విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ సినిమా చూసి ఫ్యాన్స్‌ అంత కాలర్‌ ఎగురేసుకుంటారని అని చెప్పను. కానీ, ఇలాంటి మాటలు ఈ కటౌట్‌ ముందు చాలా చిన్నవి అంటూ వ్యంగ్యంగా అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో మారుతిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. దీనికి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఒకరు మారుతిని విమర్శలు చేస్తూ ఓ కామెంట్‌ చేశారు.

కాలర్‌పై సెటైరికల్‌గా..

Advertisement

‘కాలర్‌ ఎగరేసుకుంటారని ఇలాంటివి చెప్పలేని అని వ్యాఖ్యానించే బదులుగా ఈ సినిమా నెక్ట్స్‌ లెవెల్లో ఉంటుందని చెప్పి వదిలేస్తే బాగుండేది. లేదా ఈ కటౌట్‌కి ఏం తప్పినే తక్కువే అన్న బాగుండేది. కానీ అవసరం లేకున్న పోలికలు చేశావు. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా కాలర్‌ ఎగిరేయడం వంటి కాన్సెప్ట్‌ని వాడుతున్నారు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి మారుతి స్పందిస్తూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పారు. డియర్‌ వెంకి.. నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మొదట ప్రతి అభిమానికి నేను క్షమాపణలు చెప్తున్నా. ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్‌ కావు. ఎవరిని బాధపెట్టాలనే, కించపరిచే ఉద్దేశం నాకు అసలే లేదు. కొన్ని సార్లు మనం ప్రమేయం లేకుండానే కొన్ని మాటలు వస్తుంటాయి. అలా అనుకోకుండా మాట్లాడినవే నా మాటలు. ఇవి ఒకరిని ఉద్దేశించేలా ఉంటాయని నేను అనుకోలేదు.

డైరెక్టర్ క్షమాపణలు

Advertisement

ఇవి ఇలా కంపేరిజన్‌ అయ్యి ఇలా తప్పుగా వెలుతుందని అసలు ఊహించలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు అమితమైన గౌరవం. వారి ఫ్యాన్స్‌ పట్ల కూడా అదే గౌరవం ఉంది. సినిమా పట్ల, మీ హీరో పట్ల మీకున్న అభిమానం, ప్రేమని నిజంగానే నేను గౌరవిస్తున్నాను” అంటూ మారుతి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మరి మారుతి సమాధానంతో అయినా ఈ వివాదానికి తెరపడుతుందా.. లేదా చూడాలి. ఇదిలా ఉంటే నిన్న విడుదలైన రాజా సాబ్‌ ఫస్ట్‌ సింగిల్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సాంగ్‌పై ఫ్యాన్స్‌ కాస్తా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ అలా ఎలా ఈ అవకాశం ఇచ్చారో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ పరోక్షంగా మారుతిపై సెటైర్లు వేస్తున్నారు. ఈ ఒక్కసాంగ్‌తో ది రాజా సాబ్‌ మూవీపై ఉన్న అంచనాలు అన్ని మారిపోయాయి. ఈ సాంగ్‌తో ఆడియన్స్‌ అంత నిరాశలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.

Also Read: HBD Anil Ravipudi: డైరెక్టర్ కాదు డాక్టర్, అందుకే మరో రాజమౌళి అయ్యాడు

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×