E-Paper
Advertisement

Shraddha Kapoor : షూటింగ్ లో శ్రద్దాకు తీవ్రగాయాలు..ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ?

Shraddha Kapoor : షూటింగ్ లో శ్రద్దాకు తీవ్రగాయాలు..ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ?
Advertisement

Shraddha Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆమె నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చెయ్యలేదు కానీ, బాలీవుడ్ లో వరుస సినిమాలను లైనప్ లో పెట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఈతా’ బయోపిక్ లో నటిస్తుంది. ఈ మూవీ సెట్ లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో శ్రద్దా ఎడమ కాలికి గాయాలు అయిన విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందనే విషయంపై స్పందించారు. ఒక వీడియోను షేర్ చేశారు. అది నెట్టింట వైరల్ గా మారింది.

గాయాల పై స్పందించిన శ్రద్దా కపూర్.. 

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ప్రస్తుతం ఈతా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె ఎడమకాలికి ఫ్రాక్చర్ అవడంతో కొద్దిరోజులు షూటింగ్ కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో సినిమాకు బ్రేక్ పడింది.. తాజాగా తన గాయల పై హీరోయిన్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ..కాలి కండరానికి దెబ్బ తగిల‌డం వ‌ల‌న కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నేను క్షేమంగానే ఉన్నా. త్వరలోనే మీ ముందుకు వస్తాను అని శ్ర‌ద్ధా క‌పూర్ పేర్కొన్నారు. ఆ వీడియో బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

Also Read :45 ఏళ్లు చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే..?

ఈతా మూవీ విషయానికొస్తే.. 

ప్రముఖ చిత్ర డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ దాదాపు 15 కిలోల బరువు పెరిగినట్లు కూడా ఈ మ‌ధ్య వార్త‌లు రావ‌డం వినే ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నాసిక్ లో జరుగుతుంది. ఒక పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రద్ధా ఈ ప్రమాదానికి గురైంది. స్పీడ్ డ్యాన్స్ మూమెంట్స్ వేస్తూ బరువైన ఆభరణాలు, నౌవారీ చీర ధరించి ఉన్న శ్రద్ధా శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై వేయడంతో గాలికి బాగా గాయాలు అయ్యాయి. ఇక ఈ ప్రమాదం తర్వాత వెంటనే ముంబైకి తరలించిన శ్రద్ధా, కొన్ని భావోద్వేగ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడానికి ప్రయత్నించినా కూడా నొప్పి ఎక్కువ కావడంతో షూటింగ్‌ను నిలిపివేశారు.. త్వరలోనే ఆమె తిరిగి షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురానున్నారని సమాచారం.. దీంతో పాటుగా మరో ఛాలెంజింగ్ రోల్ లో కొత్త సినిమాలో నటిస్తుందట. త్వరలోనే దీనిపై అనౌన్స్ చెయ్యనున్నట్లు వీడియోలో చెప్పింది.. ఆ వీడియోలో శ్రద్దా ఏమన్నదో చూడండి..

Advertisement

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×