E-Paper
Advertisement

Bus Accident: ఆగని బస్సు ప్రమాదాలు.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. 8 మంది స్పాట్ డెడ్

Bus Accident: ఆగని బస్సు ప్రమాదాలు.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. 8 మంది స్పాట్ డెడ్
Advertisement

Bus Accident: వరుస బస్సు ప్రమాదాలతో ప్రజల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఏదోక ప్రదేశంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొని అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ముప్పైకి పైగా ప్రయాణికులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. కడయనల్లూరు సమీపంలోని ఇడైక్కల్ దురైసామిపురం వద్ద రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఢీకొన్న ప్రభావంతో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Also Read: కూలీలు వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా.. స్పాట్‌లో 20 మంది

దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మధురై నుంచి సెంకోట్టై మార్గంలో వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో బయటపడింది. కలెక్టర్ కమల్ కిషోర్, ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన వారిని టెన్‌కాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×