BigTV English

Director Maruthi : నానికి కథ చెప్తే, నాలో లోపాలు చెప్పాడు

Director Maruthi : నానికి కథ చెప్తే, నాలో లోపాలు చెప్పాడు
Advertisement

Director Maruthi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో మారుతి ఒకరు. ఒకటి రెండు సినిమాలు ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించలేదు. కానీ మారుతి సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. అయితే ఇప్పటివరకు మారుతి కెరియర్ లో కంప్లీట్ డిజాస్టర్ అనుకునే సినిమా ఒకటి కూడా పడలేదు. ఎంటర్టైన్మెంట్ తో సినిమాని నడిపించడం మారుతికి అలవాటైపోయింది. చాలా ఈజీగా ఎంటర్టైన్మెంట్ మారుతి రాస్తాడు.


ఈ రోజుల్లో సినిమాతో ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అక్కడితోనే దర్శకుడుగా సెటిల్ అయిపోయాడు. అయితే రోజులు మారుతున్న కొద్దీ తన రచన శైలి కూడా కంప్లీట్ గా మారిపోయింది. మొదటిసారి నాని లాంటి మిడ్ రేంజ్ హీరోతో భలే భలే మగాడివే అనే సినిమా చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ దగ్గరయిపోయాడు దర్శకుడు మారుతి. ఆ తర్వాత మారుతి చేసిన అన్ని సినిమాల్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటాయి.

నాని లోపాలు చెప్పాడు 

నాని హీరోగా భలే భలే మగాడివే అనే సినిమా చేశాడు మారుతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోకి మతిమరుపు అనే ఒక లోపాన్ని పెట్టి కామెడీ జనరేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది.


ఈ సినిమా ఫస్ట్ అఫ్ చెప్పగానే నాని ఓకే చేశారట. సెకండ్ ఆఫ్ కనీసం వినలేదు. అయితే నాని ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టులో చాలా ఇన్వాల్వ్ అయ్యారట. మారుతి గారు మీరు చాటా భారతం లాగా చాలా పెద్ద పెద్ద మాటలు రాస్తున్నారు. అంత అవసరం లేదు ఇంత ఉంటే చాలు అని మారుతి రాసిన డైలాగ్స్ ని క్రిస్ప్ చేసేవారట. నీలో లోపం ఇది మాత్రమే అని మారుతికి గుర్తు చేశారట.

ఎక్స్పెక్టేషన్స్ రాజా సాబ్

ఇక ప్రస్తుతం మొదటిసారి ఒక స్టార్ హీరో తో పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉండబోతుంది అని ముందుగానే చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. అయితే ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉండబోతుందో అని మరోసారి గుర్తు చేయనున్నాడు మారుతి. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మారుతి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇంకా సినిమా పైన నమ్మకాన్ని పెంచేశాయి.

Also Read: Shivanna : గుమ్మడి నరసయ్య పాత్రలో శివన్న, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

Related News

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు

Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర ఆలోచించలేదా?

Skn : అగ్రిమెంట్ విషయంలో హీరోయిన్స్ కి ఖచ్చితంగా అది చెప్పాలి

Bandla Ganesh : నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చా, డిజాస్టర్ సినిమాతో ఆపేయలేదు

Mari Selvaraj : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్? బైసన్ సినిమా పై సూపర్ స్టార్ రియాక్షన్

Hansika Motwani: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హన్సిక.. అందుకే పేరు మార్చుకున్నానంటూ!

Big Stories

×