Shivanna : రీసెంట్ టైమ్స్ లో కొంతమంది నిజజీవిత కథలను ఆధారంగా చేసుకొని దర్శకులు సినిమాలు చేయడం మొదలు పెడుతున్నారు. చాలామంది కొత్త దర్శకులు కూడా బయోపిక్ సినిమాలతో ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయమవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా బయోపిక్ సినిమాలు వచ్చాయి. పుస్తకాల్లో చదువుకునే చాలామంది జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు నేటి దర్శకులు.
ప్రముఖ రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరమేశ్వర్. గుమ్మడి నరసయ్య గురించి తెలియని వాళ్లు ఉండరు. రాజకీయాలంటే కేవలం అమ్ముకోవడం, అమ్ముడు పోవడం అనుకునే ఈ కాలంలో నిస్వార్థపూరిత రాజకీయ నాయకులు అతి తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో గుమ్మడి నరసయ్య ఒకరు.
తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఆదరిస్తారు అని చాలాసార్లు రుజువు అయింది. నటులతో సంబంధం లేకుండా మంచి కథలను చూడటం అలవాటు చేసుకున్నారు ప్రేక్షకులు. అందుకే పరభాష నటులకు కూడా ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుంది.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ గుమ్మడి నరసయ్య పాత్రలో కనిపిస్తున్నారు. శివ రాజ్ కుమార్ ను అందరూ ముద్దుగా శివన్న అని పిలుచుకుంటారు. గుమ్మడి నరసయ్య పాత్రలో శివన్న ఉండే సినిమా పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. గుమ్మడి నరసయ్య పాత్రకు శివన్న పర్ఫెక్ట్ సెలక్షన్ అని ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది.
ఒక వ్యక్తి కథను సినిమాగా చెబుతున్నారు అంటే దానిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అటువంటి ప్రత్యేకత ఉంటేనే చూసే ప్రేక్షకుడికి ఆసక్తి కూడా నెలకొంటుంది. ఇక గుమ్మడి నరసయ్య విషయానికి వస్తే.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు గిరిజన ప్రజల పట్ల క్రూరమైన ప్రవర్తన గురించి తెలుసుకున్న తర్వాత గుమ్మడి నర్సయ్య 1978లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన రాజకీయ జీవితం ప్రారంభంలో ఆయన టేకులపల్లి గ్రామ సర్పంచ్ (గ్రామపెద్ద)గా పనిచేశారు.
నర్సయ్య 1983 రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి యెల్లందు నియోజకవర్గం నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 1985 మరియు 1989లో వరుసగా రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా ఆయన తన కెరీర్‌ను కొనసాగించారు. ఆయన యెల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మొత్తం 5 సార్లు పనిచేశారు.
రాజకీయ నాయకులు అంటే కార్లు బంగ్లాలు విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకున్నారు అని మనం నిత్యం కొన్ని కథనాల్లో వింటూ ఉంటాం. కానీ అందరికీ భిన్నంగా తన జీవితాన్ని ప్రజాశాలకే అంకితం చేశారు గుమ్మడి నరసయ్య. చాలామంది రాజకీయ నాయకులకు గుమ్మడి నరసయ్య జీవితం ఆదర్శం అని చెప్పాలి. బహుశా ఇన్ని ప్రత్యేకమైన క్వాలిటీలు తనలో ఉన్నాయి కాబట్టే సినిమాగా ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు.
Also Read: Prabhas Hanu Title : కొత్తదేమీ ఏం లేదు… ప్రభాస్ మూవీ అప్డేట్‌పై హోప్స్ పెట్టుకోవడం దండగ ?