OTT Movie : ఈ శుక్రవారం ఓటీటీలలో రిలీజ్ అవుతున్న (అక్టోబర్ 24, 2025) సినిమాలలో ఏడు కొత్తవి రాబోతున్నాయి. వీటిలో మూడు సినిమాలతో పాటు, ఒక వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. Netflix, JioHotstar, Prime Video ఓటీటీలు, సినిమా ఫ్యాన్స్ కి ఈ వీకెండ్ కి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓటీటీల్లో ఈ సరికొత్త సినిమాలు పర్ఫెక్ట్ వాచ్ గా నిలవబోతున్నాయి. తెలుగులో “కురుక్షేత్ర: పార్ట్ 2”, మలయాళంలో “నాడికర్”, హిందీలో “పరం సుందరి”, తమిళంలో “షక్తి తిరుమగన్” వంటి సినిమాలు, మిథాలజి, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ మిక్స్‌తో ఒక్కోటి ఒక్కోరకంగా ఎంటర్టైన్ చేయనున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసు కుందాం పదండి.
ఈ మిథాలజికల్ యానిమేటెడ్ సిరీస్, మహాభారత యుద్ధం ముగింపు సమయంలో జరుగుతుంది. ఈ సీజన్ మహాభారతంలోని 18 రోజుల యుద్ధంలోని, చివరి తొమ్మిది రోజులపై దృష్టి పెడుతుంది. అభిమన్యుడి విషాద మరణం, అర్జునుడు, కర్ణుడి మధ్య జరిగిన చివరి యుద్ధాలు, భీముడి, ధుర్యోధనుడి పోరాటాల వంటి ప్రధాన సంఘటనలను ఈ సిరీస్ కవర్ చేస్తుంది. ఇది వరకే వచ్చిన పార్ట్ 1 కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అక్టోబర్ 24 నుంచి పార్ట్ 2 మరింత సంచలనం సృష్టించబోతోంది.
ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా పరం పాత్రలో, జాన్వీ కపూర్ సుందరి పాత్రలో నటించారు. ఈ కథ పరమ్ అనే రిచ్ కిడ్ తో మొదలవుతుంది. అతను పెళ్లి సంబంధాల యాప్ బిజినెస్ లోకి దిగుతాడు. కేరళలోని ఒక అందమైన హోమ్‌స్టే నడిపే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీళ్ళ సంస్కృతి వేరు కావడంతో, ఫన్నీ ఇన్సిడెంట్స్ తో ఫీల్ గుడ్ ఎండింగ్ ని ఇస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 24 నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.
ఈ మలయాళ కామెడీ డ్రామాలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అతను ఒక సూపర్ స్టార్ నటుడు. అతని అహంకారం, అతని కెరీర్ ను నాశనం చేసే విధంగా తీసుకెళ్తుంది. అతను తన మేనేజర్ సలహా తీసుకుని, తన గౌరవాన్ని తిరిగి పొందడానికి యాక్టింగ్ కోచ్ సౌబిన్ షాహిర్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటాడు. అతను తన స్టార్‌డమ్‌ను తిరిగి పొందే ఈ క్రమంలో ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది. లయన్స్‌గేట్ ప్లే లో ఈ సినిమా అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఈ తమిళ పొలిటికల్ థ్రిల్లర్ లో విజయ్ ఆంటోనీ అనే వ్యక్తి, తన తల్లి హత్య తర్వాత, న్యాయం కోసం పోరాడతాడు. ఆమె మరణానికి కారణమైన, శక్తివంతమైన వ్యక్తులను ఎదుర్కొంటాడు. JioHotstar లో ఈ సినిమా అక్టోబర్ 24న అందుబాటులోకి వస్తుంది.
అలాగే ‘ఈడెన్’ (ప్రైమ్ వీడియో), ‘ది కర్దాషియన్స్ సీజన్ 7’ (జియోహాట్‌స్టార్ ), ‘ది అప్రెంటిస్’ (లయన్స్‌గేట్ ప్లే) వంటి సినిమాలు కూడా ఈ శుక్రవారం విడుదల కానున్నాయి.
Read Also : ‘స్క్విడ్ గేమ్’ను మరిపించే డేంజరస్ సర్వైవల్ గేమ్… కాన్సెప్ట్ వేరు గానీ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్