OTT Movie : సైకో కిల్లర్ లు రక రకాల కారణాలతో మనుషుల్ని టార్గెట్ చేస్తుంటారు. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళు, అప్పుడప్పుడూ ఎదురుపడుతుంటారు. వీళ్ళు పైకి మంచిగా కనబడుతూనే, లోపల చాలా క్రూయల్ గా ఉంటారు. ఇక సినిమాలలో కూడా బ్లడ్ బాత్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కిల్లర్ మరింత హింసాత్మకంగా ఉంటాడు. ఇతను ఒక వెబ్ సైట్ లో లైవ్ మర్డర్స్ చేస్తుంటాడు. ఇతన్ని పట్టుకునేందుకు, ఒక FBI మహిళా ఏజెంట్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో స్టోరీ మరింత ఇంటెన్స్ తో నడుస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘అన్‌ట్రేసబుల్’ (Untraceable) 2008లో వచ్చిన సైకలజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. డేవిడ్ మెర్స్ దర్శకత్వంలో డైనా క్రస్టన్, జోష్ డ్యూహమెల్, జోసెఫ్ క్రోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008 జనవరి 25న విడుదల అయింది. ఈ సినిమా జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబి లో దీనికి 6.8/10 రేటింగ్ ఉంది.
జెరి FBI సైబర్ క్రైమ్ ఏజెంట్ గా పని చేస్తుంటుంది. జెరి తన భర్త చనిపోయిన తర్వాత, కూతురు ఆవాతో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమె చాలా తెలివిగా, ఆన్‌లైన్ క్రైమ్‌లను పరిశోధిస్తుంటుంది. ఒక రోజు ఆమెకు “killwithme.com” అనే వెబ్‌సైట్ గురించి తెలుస్తుంది. ఈ సైట్‌లో ఓవెన్ అనే ఒక సీరియల్ కిల్లర్, లైవ్‌లో హత్యలు చేస్తుంటాడు. ఆ సైట్‌ను చూసే వాళ్లు ఎక్కువ క్లిక్ చేస్తే, విక్టిమ్ చనిపోతాడు. మొదటి హత్య ఒక మహిళపై జరుగుతుంది. ఆమెను చైన్‌తో కట్టి, డ్రగ్స్ ఇచ్చి దారుణంగా చంపుతాడు. జెరి ఈ కేసును తీసుకొని, ఓవెన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు ఎరిక్ అనే వ్యక్తి ఈ కేసులో సపోర్ట్ గా ఉంటాడు.
Read Also : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్
జెరి, ఎరిక్ ఓవెన్‌ను ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఓవెన్ చాలా తెలివిగా, ఆన్‌లైన్‌లో తన ఐడెంటిటీ దొరక్కుండా తప్పించుకుంటాడు. ఈ సమయంలో ఓవెన్ మరిన్ని హత్యలు చేస్తాడు. వీళ్ళను రక రకాలుగా టార్చర్ పెట్టి చంపుతుంటాడు. ఇప్పుడు జెరిని, ఆవాను ఓవెన్ టార్గెట్ చేస్తాడు. మొదటి సారి ఆమె బాగా భయపడుతుంది. జెరి కూతురు ఆవాను కిడ్నాప్ చేసి, ఆమెను లైవ్‌లో చంపాలని ఓవెన్ ప్లాన్ చేస్తాడు. ఈ క్లైమాక్స్ మరింత ఉత్కంఠతను పెంచతుంది. జెరి తన కూతుర్ని కాపాడుకుంటుందా ? ఓవెన్ తన ప్లాన్ ను అమలు చేస్తాడా ? ఓవెన్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, సైకలజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.