E-Paper
Advertisement

Director Maruthi: బడా హీరోలతో పంచతంత్రం మూవీ… కథ కూడా సిద్ధం.. మరి అవకాశం?

Director Maruthi: బడా హీరోలతో పంచతంత్రం మూవీ… కథ కూడా సిద్ధం.. మరి అవకాశం?
Advertisement

Director Maruthi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న డైరెక్టర్ మారుతి (Maruthi ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

స్టార్ హీరోలతో మల్టీ స్టారర్..

ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో మారుతి సినిమా చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఊహించని ట్విస్ట్ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. తాజాగా ది రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మారుతి తన కోరికను తాజాగా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. “టాలీవుడ్ బడా సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ , నటసింహా నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశ్వనటుడు కమలహాసన్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ స్టార్లతో పంచతంత్రం సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ ఐదుగురిని లీడ్ చేసే సామర్థ్యం నాకు ఉంది. పైగా నా దగ్గర కథ కూడా ఉంది” అంటూ తన కోరికను బయటపెట్టారు మారుతి.

అవకాశం ఇస్తారా?

Advertisement

అంతా బాగానే ఉన్నా మరి మారుతికి ఈ హీరోలందరూ అవకాశం ఇస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వీరు గనుక మారుతికి అవకాశం ఇచ్చారంటే ఇండస్ట్రీని తిరగరాసే సినిమా అవుతుందని, ఇంతమంది స్టార్స్ ని ఒకే తెరపై చూసి అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తారని నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఐదుగురిని లీడ్ చేసే సత్తా ఉందంటున్న మారుతి ఈ ఐదుగురిని ఒప్పించి, తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి.

మారుతి కెరియర్..

చదువు పూర్తయ్యాక యానిమేటర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. తన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి నంబర్ ప్లేట్, సైన్ బోర్డు లకు పెయింట్ చేసేవాడట. 2012లో ఈ రోజుల్లో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన ఈయన.. 50 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న ఈయన.. నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ALSO READ:Naa Anveshana: కొడుకా.. తాట తీస్తా.. నా అన్వేషణపై రెచ్చిపోయిన భయ్యా సన్నీ యాదవ్!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×