E-Paper
Advertisement

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్
Advertisement

Director Maruthi: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నేడు తన 47వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు(Prabhas Birthday) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ మారుతీ (Maruthi)సైతం ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోనే తన అధికారక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభాస్ ఎంతోమందికి స్ఫూర్తి..

ఈ సందర్భంగా మారుతీ స్పందిస్తూ.. నా గురువు నా ఆశయం నేను చూసిన అత్యుత్తమ వ్యక్తులలో ఒకరైన పాన్ ఇండియా స్టార్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రభాస్ వెండితెరపై ప్రభంజనం సృష్టించిన తెరవెనుక ఆయన చూపించే వినయం కష్టపడే తత్వం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తాయి ఆయన మరిన్ని విజయాలు సాధించాలి.. ఎల్లప్పుడూ ప్రభాస్ వెంటే నడుస్తాను అంటూ ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఈయన పోస్ట్ చేశారు. ఇలా మారుతి ప్రభాస్ గురించి ఆయన చూపించే ప్రేమ పట్ల ఎంతో ఎమోషనల్ పోస్ట్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

డిజాస్టర్ గా ది రాజా సాబ్…

Advertisement

ఇలా మారుతి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ పోస్ట్ పట్ల స్పందిస్తూ డైరెక్టర్ మారుతికి తమదైన శైలిలోనే వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా ఛాన్స్ ఇస్తే ఆయనతో డిజాస్టర్ సినిమా చేసి ఇప్పుడు ఇలాంటి పోస్టులు అవసరమా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు ఇకపై ప్రభాస్ తో ఎప్పుడు సినిమాలు చేయొద్దని మరోసారి ఆయన జోలికి రావద్దు అంటూ కూడా అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

ప్రభాస్ పట్ల ఎంతో ప్రేమతో మారుతి చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ విమర్శలు కురిపించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అయినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలవడంతో ప్రభాస్ అభిమానులు ఛాన్స్ దొరికిన ప్రతిసారి మారుతిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు.

Also Read: ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Related News

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రన్ టైం లాక్.. కీలక సన్నివేశాలు డిలీట్ చేసిన గురూజీ!

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రాజకీయాల వల్ల కోట్లు పోగొట్టుకున్న నటుడు?

“వయలెంట్ మ్యాన్” ప్రభాస్ కి ‘సలార్ 2’ టీమ్ స్పెషల్ బర్తడే విషెస్.. క్రేజీ అప్డేట్ వైరల్!

ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. కల్కి 2 నుండి ఆకట్టుకుంటున్న అప్డేట్!

ప్రభాస్ కి జపాన్ ఆడియన్స్ స్పెషల్ సర్ప్రైజ్.. వీడియో వైరల్!

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!

Big Stories

Advertisement
×