E-Paper
Advertisement

ఆడియన్స్ కు అదిరిపోయే వీకెండ్… ఏకంగా 8 సినిమాలు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఆడియన్స్ కు అదిరిపోయే వీకెండ్… ఏకంగా 8 సినిమాలు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే
Advertisement

Latest Telugu OTT Releases: వీకెండ్‌ వచ్చిందంటే ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లాలా, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలా, ఇంట్లోనే కూర్చుని కొత్త సిరీస్‌ మొదలు పెట్టాలా అని ప్లాన్‌ చేసుకుంటాం. థియేటర్లకు వెళ్లే టైమ్‌ లేకపోయినా, ఓటీటీలో కొత్త కంటెంట్‌ మాత్రం మిస్‌ కావాలనిపించదు. అలాంటి ప్రేక్షకుల కోసం ఈ వారం తెలుగు ఆడియోలోనూ చూడగలిగే సినిమాలు, సిరీస్‌ లు పలు ప్లాట్‌ఫామ్‌ లలోకి వచ్చాయి. యాక్షన్‌, మిస్టరీ, కామెడీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ నుంచి మైథాలజీ యానిమేషన్‌ వరకు వేర్వేరు జానర్లలో తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

పక్కా తెలుగు సినిమాలు

ముందుగా నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 22 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. 1980ల నేపథ్యంలో అణచివేతకు గురైన ఓ సమాజం తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ఈ కథలో కీలకం. నాని, కయాదు లోహర్‌, మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఆహాలో ‘నా వైఫ్‌ మిస్సింగ్‌’ (Na Wife Missing) తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ నటించిన ఈ మిస్టరీ డ్రామాలో పెళ్లైన కొద్దికాలానికే భార్య కనిపించకుండా పోవడం కథను కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. ఆమె కోసం భర్త చేసే అన్వేషణలో బయటపడే విషయాలే ఆసక్తిని పెంచుతాయి.

జియోహాట్‌స్టార్‌లో వచ్చిన ‘వరం’ (Varam) ఓ పేద యువకుడి జీవితంలో అనుకోకుండా జరిగే మార్పుల చుట్టూ తిరుగుతుంది. అతడికి లభించిన ఓ వింత వరం అదృష్టాన్ని మార్చినా, దాని ప్రభావం ఎటు దారి తీస్తుందన్నదే కథలో ఆసక్తికరమైన అంశం. మరోవైపు ‘ఫైట్‌ మహా’ (Fight Maha) ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంది. పోలీస్‌ శాఖలో స్కెచ్‌ ఆర్టిస్ట్‌ గా పని చేసే మహా నిద్రలో నడిచే అలవాటు వల్ల ఓ హత్య కేసులో చిక్కుకోవడం ఈ థ్రిల్లర్‌ కు బేస్‌.

తెలుగు డబ్బింగ్ సినిమాలు

Advertisement

మైథాలజీ, యాక్షన్‌ ఇష్టపడేవారికి ‘ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌’ సీజన్‌ 7 మరో బెస్ట్ ఆప్షన్. లంక యుద్ధం కీలక దశకు చేరిన సమయంలో హనుమంతుడి సాహసాలు ఈ కొత్త సీజన్‌ లో కొనసాగుతాయి. జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ కామెడీ ‘ధూమకేతు’ (Dhoomakethu). పెళ్లి రోజునే తన మరణం గురించి కలగన్న కుట్టన్‌ కథ ఇది. పెళ్లి రోజు మళ్లీ మళ్లీ రిపీటయ్యే టైమ్‌ లూప్‌ లో చిక్కుకున్న అతడు దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తాడు. అలాగే కీర్తి సురేష్‌ నటించిన ‘డొరోథీ’ (Dorothy) కూడా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఓ గ్రామంలోని ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి డొరోథీ రావడంతో వారి ఆలోచనలు, సంబంధాలు ఎలా మారతాయన్నది ఈ సోషల్ డ్రామా స్టోరీ.

ఇలా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా ఈ వారం ఓటీటీలో వేర్వేరు కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మీకు ఏ సినిమా లేదా సిరీస్‌ నచ్చుతుందనేది మీ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో ఓటీటీలో ఒక్కో సినిమా ఉంది. చూసే ముందు ఒకసారి చెక్‌ చేసుకుంటే మీ వీకెండ్‌ ప్లాన్‌ మరింత ఈజీ అవుతుంది.

Read Also: థియేటర్లలో 170 కోట్లు కొల్లగొట్టిన నాని ఊచకోత… ఐదు భాషల్లో ఓటీటీలోకి

Tags

Related News

36 ఏళ్ల బ్యాచిలర్‌ కు చెప్పుకోలేని కష్టాలు… పెళ్లయినా శోభనం మాత్రం జరగదు… మలయాళ టైమ్‌ లూప్‌ కామెడీ తెలుగులో

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజే 7 సినిమాలు..!

90 ఏళ్లకోసారి వచ్చే ఫెస్టివల్… పండగకు పిలిచి పాతిపెట్టే ప్లాన్… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

మరువలేని స్టార్ హీరో మరుగున పడిపోతే… హీరోలను ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ డోంట్ మిస్… వైరల్ సిరీస్

మతాలు వేరైనా మనసులు కలిస్తే… ట్రెండింగ్ రొమాంటిక్ కామెడీ సిరీస్

పేదరికంలో బతికే వ్యక్తికి భవిష్యత్తు ముందే తెలిసే వరం… రాత్రికి రాత్రే రచ్చ… తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ షురూ

భార్య మిస్సయ్యిందని వెళ్తే పోలీసులకే దిమ్మతిరిగే షాక్… 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ – శ్వేత బసు జంటగా నటించిన సిరీస్ స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×